Share News

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌కు విద్యార్థుల ఎంపిక

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:23 AM

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకంలో భాగంగా 2026-27 విద్యాసంవత్సరానికి 1వ తరగతిలో నాన్‌ రెసిడెన్షియల్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌లో ప్రవేశాల కోసం పిల్లల కుటుంబ సభ్యుల సమక్షంలో లాటరీ పద్ధతిన డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేశారు.

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌కు విద్యార్థుల ఎంపిక

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకంలో భాగంగా 2026-27 విద్యాసంవత్సరానికి 1వ తరగతిలో నాన్‌ రెసిడెన్షియల్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌లో ప్రవేశాల కోసం పిల్లల కుటుంబ సభ్యుల సమక్షంలో లాటరీ పద్ధతిన డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లాలో 1వ తరగతి నాన్‌రెసిడెన్షియల్‌ కోసం 109 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 1వ తరగతికి 33 శాతం బాలికల రిజర్వేషన్‌ ప్రకారం 15 సీట్లు, జనరల్‌ కేటగరిలో 31 సీట్లు కలిపి మొత్తం 46సీట్లకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ సమక్షంలో పిల్లల కుటుంబ సభ్యులతో కలిసి లాటరీ తీసి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్‌ కులాల అభవృద్ది అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ కో-ఆర్డి నేటర్‌ జాస్మిన్‌ థేరిస్సా, ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మోహర్రం వేడుకల పకడ్బందీ ఏర్పాట్లు..

జిల్లా వ్యాప్తంగా మోహర్రం వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లును సంబంధిత అధికారులు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం మోహరం వేడుకలపై మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని అశూర్‌ ఖానాల్లో పరిశుభ్రత పనులు చేయించాలని విద్యుత్‌దీపాలు, తాగునీరు అందుబాటులో పెట్టాలని డీపీవో, మున్సిపల్‌ కమిషనర్‌లను ఆదేశించా రు. ట్రాఫిక్‌ సమస్యలు కలగకుండా ఏర్పాట్లు చేయించాలని పోలీసు లకు సూచించారు. సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అయేషా తలత్‌, డీపీవో షరీప్పుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 12:23 AM