నిబంధనలకు అనుగుణంగా అర్హుల ఎంపిక
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:55 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన సంక్షేమ పథకాలకు ప్రభుత్వ నింబధనలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన సంక్షేమ పథకాలకు ప్రభుత్వ నింబధనలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా షెడ్యూల్డ్ కులాల సహకార సంఘ అభివృద్ధి సంస్థ యాక్షన్ ప్లాన్‌పై జిల్లా కమిటీ స్థాయి సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటీవ్ డైరె క్టర్, ఎస్పీ కార్పొరేషన్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26కి సంబంధించిన అం శాలు, మండలాల వారీగా లక్ష్యాలను ఆమోదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్దిదారుల, మండల స్థాయిలో లక్ష్యాల కేటాయిం పు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత సమయంలో చేయా లని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పోరేషన్ ఈడీ స్వప్న, జిల్లా పరి శ్రమల శాఖ జీఎం హనుమంతునాయక్, జిల్లా పశుసంవర్దకశాఖ అధి కారి డాక్టర్ రవీందర్‌రెడ్డి, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్‌కుమార్, ఎల్‌డీ ఎం మల్లికార్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.