Share News

ప్రభుత్వం సూచించిన విత్తనాలను సాగు చేయాలి

ABN , Publish Date - May 16 , 2026 | 12:10 AM

రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఎనమిది రకాల విత్తనాలను మాత్రమే సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్వవసాయ అఽధికారి భాగ్యలక్ష్మి రైతులకు సూచించారు.

ప్రభుత్వం సూచించిన విత్తనాలను సాగు చేయాలి
మానకొండూర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న భాగ్యలక్ష్మి

మానకొండూర్‌, మే 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఎనమిది రకాల విత్తనాలను మాత్రమే సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్వవసాయ అఽధికారి భాగ్యలక్ష్మి రైతులకు సూచించారు. మానకొండూర్‌లోని రైతు వేదికలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మాట్లాడారు. మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్న వరి రకాలు సాగు చేయడమే కాకుండా సాగు నీటిని ఆదాచేసి భావితరాలకు అందించాలని ఆమె సూచించారు. పంటమార్పిడి పద్ధతి పాటించి సుస్థిరమైన ఆదాయం పొందాలని అన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని ఆమె రైతులను కోరారు. ప్రతి ఒక్కరు చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. జిల్లాలో నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త టి. ఉషారాణి, మండల వ్వవసాయ అధికారి కే. శ్రీనివాస్‌రెడ్డి, ఫిషరీఫ్‌ అధికారి గోపాల్‌, సురేందర్‌ నాయక్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 12:10 AM