Share News

ఇందిరమ్మ ఇళ్లతో భద్రత, ఆత్మగౌరవం

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:53 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో ప్రతీ కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుకు భరోసాను కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌కుమార్‌ అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లతో భద్రత, ఆత్మగౌరవం
వెల్ధుర్తిలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌/రాయికల్‌, జూన 17 (ఆంధ్రజ్యో తి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో ప్రతీ కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుకు భరోసాను కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాం, ఒడ్డెరకాలనీ, వెల్దుర్తి, రా యికల్‌ మండలంలోని భూపతిపూర్‌ గ్రామాల్లో ఇంది రమ్మ ఇళ్లను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ బుధవారం ప్రారంభించారు. అనంతరం వెల్ధుర్తి గ్రామంలో నిర్వ హించిన మడలేశ్వరస్వామి విగ్రహప్రతిష్ఠ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయా లనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు సదాశివరావు, ఆడువాల జ్యోతి, ప్రకాశ, మాజీ ఎంపీటీసీ బందెల శంకర్‌, సర్పం చలు బెజ్జంకి మోహన, భావనమహేందర్‌, ఆత్మ చైర్మ న కాటిపెల్లి గంగారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన ఏనుగు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిత్వ హననానికి పాల్పడడం తగదు

జగిత్యాల అర్బన: జగిత్యాల మండలం చల్‌గల్‌లో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయం విషయలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అనవసరపు రాజకీయాలు చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ఎంపీ స్థాయికి తగదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. బుఽధవారం జగిత్యాల పట్టణంలోని పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయానికి ఐదెకరాల స్థలం కేటాయింపునకు కలెక్టర్‌ సర్వే చేసి డిప్యూటీ కమిషనర్‌ కేంద్రీయ విద్యాలయం సంఘటనకు 10 రోజుల క్రితం పంపించారన్నారు. అయినప్పటికీ కేంద్రీ య విద్యాలయంపై ఎంపీ తీరు మారడం లేదని, కేంద్రీయ విద్యాలయాన్ని కావాలని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ని పాత ఎస్పీ కార్యాలయాన్ని కేంద్రీయ విద్యాలయా నికి కేటాయించామని, అందులో అవసరమైన మరమ్మ తులు కూడా చేశామన్నారు. ఇకనైనా ఎంపీ, ఆయన అనుచరులు కేంద్రీయ విద్యాలయంపై రాజకీయాలు మానుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన, మున్సిపల్‌ మాజీ చైర్మన్లు అడువాల జ్యోతి, గిరి నాగభూషణం, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:53 PM