Share News

గెలుపు గుర్రాలకే సీట్లు

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:05 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. నగరంలో బీజేపీ కరీంనగర్‌ కార్పొరేషన్‌ నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు.

 గెలుపు గుర్రాలకే సీట్లు
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

భగత్‌నగర్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ కార్పొరేషన్‌లో గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. నగరంలో బీజేపీ కరీంనగర్‌ కార్పొరేషన్‌ నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏ క్షణమైనా మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముందన్నారు. కరీంగర్‌ కార్పొరేషన్‌లో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. టికెట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎవరికీ టిక్కెట్లు ఇస్తామని హామీ ఇవ్వలేదన్నారు. కొంతమంది తన కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి చేయిస్తున్నారని, అలాంటి వారికి టికెట్లు ఇవ్వబోమన్నారు. బీజేపీలో కుటుంబ సభ్యుల జోక్యం ఉండబోదన్నారు. టికెట్ల కేటాయింపులో ఏయే అంశాలు పరిగనణలోకి తీసుకోవాలో సూచనలు ఇవ్వాలని నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా నాయకులంతా కరీంనగర్‌ కార్పొరేషన్‌లో కలిసికట్టుగా ప్రచారం చేసి కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. గడగడపకు వెళ్లి కేంద్రం చేసిన అభివృద్ధిని వివరించి ఓట్లు అడుగతామన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, మాజీ మేయర్‌ సునీల్‌రావు, కోమల ఆంజనేయులు, డిప్యూటీ మేయర్‌ గుగ్గిల్ల రమేష్‌, బోయినపల్లి ప్రవీణ్‌రావు, వాసాల రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 12:05 AM