Share News

డ్రైవింగ్‌లో సీట్‌ బెల్ట్‌ తప్పనిసరి

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:51 PM

డైవ్రింగ్‌లో సీట్‌ బెల్ట్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్‌ అన్నారు.

డ్రైవింగ్‌లో సీట్‌ బెల్ట్‌ తప్పనిసరి

వేములవాడ టౌన్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : డైవ్రింగ్‌లో సీట్‌ బెల్ట్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్‌ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్స వాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ సిబ్బంది శుక్రవారం వేముల వాడ కమాన్‌ వద్ద విస్తృత తని ఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్‌ మాట్లాడుతూ ట్రాఫిక్‌, రోడ్డు భద్ర తా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. కార్ల వాహ నదారులు సీటు బెల్ట్‌ పెట్టుకోవా లని, మద్యం తాగి నడపవద్దని, రాంగ్‌ రూట్‌లో వెళ్లకూడదని సూచించారు. మొబైల్‌ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని అన్నారు. స్పీడ్‌ కంట్రోల్‌లో ఉండాలని, వాహనం రివర్స్‌లో వెళ్లేప్పుడు తప్పని సరిగా వాహనం కింద, వెనుక గమ నించాలని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకుని వాహనాన్ని నడిపిన వారికి స్వీట్లు పంపిణీ చేశారు. సీటు బెల్ట్‌ ధరించకుండా వాహనాలను నడిపిన వారికి దాని ప్రాముఖ్యత గురించి వివ రించారు. వాహనాలకు వాహన భద్ర తా స్టిక్కర్లు అతికించారు. సీట్‌ బెల్ట్‌ పెట్టుకొని వాహనం నడుపుతామని వాహనదారులతో రోడ్డు భద్రతా మా సోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ట్రాఫిక్‌ ఎస్‌ఐ రాజు, మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్‌, మోటార్‌ వాహనాల సహాయక తనిఖీ అధికారి రజిని, పృథ్వీ రాజ్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:51 PM