Share News

శాస్త్రవేత్తలను స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:23 AM

శాస్త్రవేత్తల కృషిని స్ఫూర్తిగా తీసుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అడిషనల్‌ కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో అశ్విని తానాజీ వాఖడే విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోరమ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ సైన్స్‌ ఆధ్వర్యంలో జిల్లా సైన్స్‌ మ్యూజియంలో విద్యార్థులకు ఫిజికల్‌ సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ను మంగళవారం నిర్వహించారు.

శాస్త్రవేత్తలను స్ఫూర్తిగా తీసుకోవాలి

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): శాస్త్రవేత్తల కృషిని స్ఫూర్తిగా తీసుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అడిషనల్‌ కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో అశ్విని తానాజీ వాఖడే విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోరమ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ సైన్స్‌ ఆధ్వర్యంలో జిల్లా సైన్స్‌ మ్యూజియంలో విద్యార్థులకు ఫిజికల్‌ సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ ధృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా సైన్స్‌ అధికారి చాడ జయపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు జిల్లా మ్యూజియంను సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. టాలెంట్‌ టెస్ట్‌లో ప్రథమ స్థానంలో కనపర్తి సుశాంత్‌ (జడ్పీహెచ్‌ఎస్‌ జంగపల్లి), ద్వితీయ స్థానంలలో భూంపల్లి కీర్తి (జడ్పీహెచ్‌ఎస్‌ జంగపల్లి), తృతీయ స్థానం కోమటిరెడ్డి ఆదిత్య (ఈజీఎంఎస్‌ ఎలగందల్‌) నిలిచారు. వీరికి మెమోంటోలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫోరమ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ సైన్స్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అమిరిశెట్టి దామోదర్‌, వి రాంకిరణ్‌, ప్లానింగ్‌ కో ఆర్డినేటర్‌ మిలకూరి శ్రీనివాస్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసుంధర, ఫోరం ఆఫ్‌ ఫిజికల్‌ సైన్స్‌ బాధ్యులు నాగుల భజన్‌చందర్‌, చంద్రశేఖర్‌, కామిరెడ్డి రామేశ్వర్‌రెడ్డి, గైడ్‌ టీచర్స్‌ గోరంటాల ఆనందం, ఎండీ మునీరొద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:23 AM