విద్యార్థుల ఖాతాల్లో ఉపకార వేతనాల డబ్బులు
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:14 AM
జిల్లాలో ఎస్సీ ప్రీ, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు రూ.కోటికి పైగా డబ్బులను విద్యార్థుల ఖాతాల్లో జమ అయ్యాయని, అలాగే ఈనెల 25న గురుకులాల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోరారు.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎస్సీ ప్రీ, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు రూ.కోటికి పైగా డబ్బులను విద్యార్థుల ఖాతాల్లో జమ అయ్యాయని, అలాగే ఈనెల 25న గురుకులాల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఎస్సీ సం క్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులా ల్లో ఖాళాగా ఉన్న సీట్ల భర్తీ, ఉపకార వేతనాల విడుదలతో పాటు తది తర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో చదువుతున్న ప్రీ మెట్రిక్ మొత్తం 1571 మంది విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో గత విద్యా సంవత్సరానికి చెందిన రూ.35లక్షల 66వేల 900, అలాగే పోస్ట్ మెట్రిక్‌లో మొత్తం 712 మంది విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో రూ. కోటి 2లక్షల 41వేలు విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఉపకార వేతనాలు మంజూరు అయ్యాయని తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 25వ తేదీన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా లయంలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్‌ల జిరాక్స్‌లతో హాజరుకా వాలని సూచించారు. ఉదయం9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట ల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 2.30 గంటల తరువాత కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురు కులంలో 5వ తరగతిలో 12, 6వ తరగతిలో 8, 7వ తరగతిలో 2, ఇంట ర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 4, బైపీసీ 1, సీజీటీ 16 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలపారు. అలాగే గంభీరావుపేట మండలం నర్మాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో 5వ తరగతిలో 20, 6వ తరగతిలో 8, 7వ తరగతిలో 2, 8వ తరగతిలో1, 9వ తరగతిలో 4, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 20, బైపీసీలో 17సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. సిరిసిల్లలోని చిన్నబోనా లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో 5వ తరగ తిలో 19, 6వ తరగతిలో 3, 8వ తరగతిలో 5, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 9, బైపీసీలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బోయినిపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో 5వ తరగతిలో 16, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 7, బైపీసీలో 25సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇల్లంతకుంటలోని తెలం గాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో 5వ తరగతిలో 33, 6వ తరగతిలో 2, 7వ తరగతిలో2, 8వ తరగతిలో 4, 9వ తరగతిలో 3, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 1, బైపీసీలో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయని, అలాగే వేములవాడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో 5వ తరగతిలో 6, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 9, బైపీసీలో 2సీట్లు ఖాళీగా ఉండ గా, ముస్తాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకు లంలో 5వ తరగతిలో4, 6వ తరగతిలో 1, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 12, బైపీసీలో 14 సీట్లు ఖాళీగా ఉన్నాయని వీటికి కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తామని, దీని కోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల జోనల్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, తెలం గాణ సాంఘీక సంక్షేమ గురుకులాల డీఈవో థెరిసా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు అందించాలి
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) అనామలీస్, నోమ్యాపింగ్ ఓటర్లకు నోటీసులను జారీ చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో ఎస్‌ఐఆర్‌పై ఈఆర్‌వోలు, ఎలక్షన్ సెక్షన్‌ల అధికారు లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్ర త్యేక ఓటర్ సమగ్ర సవరణ కింద జిల్లాలో 5008 నోమ్యాపింగ్ ఓటర్లు, 78,833 నామలీస్ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఆయా ఓటర్లకు బూత్ లెవల్ అఽధికారులు నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఓటర్లు 12 రకాల గుర్తింపు కార్డులతో ఏదైనా ఒకటి మిగతా వివరాలు ఇవ్వాలని తెలిపారు. ఆర్డీవోలు తమ పరిధిలోని బీఎల్‌వోలకు నోటీసు లు జారీ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలని అదేశించారు. ఎన్నికల సంఘం అదేశాలకు అనుగుణంగా ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయా లని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎన్‌బీ కుమారీ, తహసీల్దార్‌లు మహేష్‌కుమా ర్‌రావు, జయంత్, ప్రవీణ్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.