మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించేందుకు పథకాలు
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:34 AM
చేప పిల్లల ఉత్పత్తిలో ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మత్స్య కార్మికులు అందిపుచ్చుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని కలెక్టర్ గరిమ అగ్రావల్ అన్నారు.
బోయినపల్లి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి) : చేప పిల్లల ఉత్పత్తిలో ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మత్స్య కార్మికులు అందిపుచ్చుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని కలెక్టర్ గరిమ అగ్రావల్ అన్నారు. నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో రూ.8లక్షల 91వేలతో మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రా న్ని కలెక్టర్ గరిమ అగ్రావల్ శుక్రవారం ప్రాంభించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌తోపాటు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ శ్రీనివాస్, ఎన్‌ఎఫ్‌డీబీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ కన్నప్ప, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎస్వీ మురుగన్, జిల్లా మత్స్య అధికారి సౌజన్యతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం చేప పిల్లల పెంపకం చేసే యూనిట్‌ను పరిశీలించి. చేపపిల్లల ఉత్పత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్య పారి శ్రామిక సహకార సంఘం సభ్యులకు చేప పిల్లలకు వేసే దాణా, మందులు, చేపల వేటలో వినియోగించే వలలు, పరికరాలు పంపి ణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు సద్విని యోగంచేసుకొని ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోవాలన్నారు. మత్స్య కార్మికులు పొందేందుకు ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా మత్స్యకార్మికులు ఆర్థికంగా బలపడాలన్నారు. జిల్లా మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్ చొప్పరి రాంచంద్రం, అధికారులు ప్రకాష్ ముత్తు, సునీల్ కుమార్, విద్యాసాగర్ రెడ్డి, రామచంద్రన్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.