Share News

సావిత్రిబాయి ఫూలే ఆశయ సాధనకు కృషి

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:00 AM

చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌ అన్నారు.

సావిత్రిబాయి ఫూలే ఆశయ సాధనకు కృషి

సిరిసిల్ల టౌన్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌ అన్నారు. మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి నిర్వహిం చారు. జిల్లా కేంద్రం అంబేద్కర్‌ చౌరస్తాలోని సావిత్రిబాయి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాం గ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రకాష్‌, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కా ల రాము మాట్లాడారు. మహనీయుల జయంతి, వర్ధంతులను విస్మరించ కుండా ఘనంగా జరుపుకోవాలన్నారు. మున్సిపల్‌ పాలకవర్గం, కమిషనర్‌ మహనీయుల జయంతి, వర్ధంతులకు కావాలసిన ఏర్పాట్లను చేయించాల న్నారు. మహిళలకు కూడా విద్యనందించాలని దేశంలో మహిళలకు అక్షరా భ్యాసం చేయించిన మొదటి మహిళగా సావిత్రిబాయి ఫూలే చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, నాయకులు రాగుల రాములు, కత్తెర దేవదాస్‌, కంసాల మల్లేశం, గడ్డం నర్సయ్య, వంకాయల కార్తిక్‌, పం బాల దేవరాజు, లక్ష్మన్‌, పండుగ రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 12:00 AM