ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:53 PM
తొలి మహిళా సంఘ సంస్క ర్త సావిత్రిబాయి ఫూలే జయంతిని శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల టౌన్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : తొలి మహిళా సంఘ సంస్క ర్త సావిత్రిబాయి ఫూలే జయంతిని శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని మహాత్మ జ్యోతిబా ఫూలే, సావిత్రిబాపూలే దంపతుల విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు పర్శ హన్మాండ్లు, చొక్కాల రాము, ఆకునూరి బాలరాజు, కరుణాల భద్రాచ లం, రాగుల రాములు, కందుకూరి రామాగౌడ్, మంగళి చంద్రమౌళి, వం కాయల కార్తిక్, నాయకులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో స్థానిక బీసీ భవన్‌లో వేడుకలను నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధి కార ప్రతినిధి పర్శహన్మాండ్లు, పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు కందుకూరి రామాగౌడ్, నాయకులు పాల్గొన్నారు. అలాగే సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.