సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలి
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:20 AM
సావిత్రిబా యి ఫూలేను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
-మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జగిత్యాల, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సావిత్రిబా యి ఫూలేను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్‌లో సావిత్రిబాయి ఫూలే జయంతి, మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించు కుని వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ బి.సత్య ప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
జిల్లాలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను అభినందించారు. సావిత్రిబాయి ఫూలే మహారాష్ట్రలోని నైగావ్‌లో జన్మిం చి, తన భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా బాలికల విద్య కోసం సామాజిక అడ్డంకులను అధిగ మిస్తూ పోరాడిన మహనీయురాలని తెలిపారు. ఆమె జీవితం మహిళా హక్కులు, దళిత సాధికారత మరియు సామా జిక న్యాయం కోసం సాగిన ఉద్యమానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రపంచ దేశాల మన్ననలు పొందిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన సోనియాగాంధీ, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమారి వంటి మహిళా నాయకులను స్ఫూర్తిగా తీసుకోవాలని మహిళలకు సూచించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం లో మహిళల అభ్యున్నతి, సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని మహిళ లు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిం చాలని ఆకాంక్షించారు. అవార్డులు పొందిన మహిళా ఉపాధ్యాయులం దరికీ అభినందనలు తెలియజేస్తూ, మరింత ఉత్సాహంతో విద్యా రంగంలో సేవలు అందించాలని కోరారు. అనం తరం జిల్లాలోని 20 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత (రెవెన్యూ), అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి.రాజగౌడ్, జిల్లా విద్యాశాఖాధికారి రాము పాల్గొన్నారు.