గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలకం
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:12 AM
గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజల కార్యాచరణలో సర్పంచులు భాగస్వాములు కావాలని సూచించారు.
తిమ్మాపూర్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజల కార్యాచరణలో సర్పంచులు భాగస్వాములు కావాలని సూచించారు. గురవారం మండల కేంద్రంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆడిటోరియంలో జిల్లాలో నూతనంగా ఎన్నికైనా సర్పంచులకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై శిక్షణ కార్యాక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరై 99 రోజుల కార్యాచరణలో చేపట్టాల్సిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పాటు పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. పన్నులు మాత్రమే కాకుండా సొంతగా ఆదాయం పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫ ప్రజలకు చేరువయ్యేందుకే 99 రోజుల ప్రణాళిక
- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించి వారికి చేరువయ్యేందుకే 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా విశేష అధికారాలు గ్రామాల్లో సర్పంచులకు ఉన్నాయన్నారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మౌలిక సదుపాయల కల్పనకు కసరత్తు చేస్తుందన్నారు. అందరి సహకారంతో గ్రామాలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డీపీవో జగదీశ్వర్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీఆర్డీవో శ్రీధర్, డీఏవో భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.