దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:36 AM
భారత దేశ ఐక్యత, సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చిరస్మరణీమని ఎస్పీ మహేష్ బీ గితే అన్నారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): భారత దేశ ఐక్యత, సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చిరస్మరణీమని ఎస్పీ మహేష్ బీ గితే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం సర్దార్‌వల్లభాయ్ పటేల్ జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లా డుతూ దేశ ఐక్యత, సమగ్రతకు సర్దార్ వల్లబాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన అలోచనలు, స్ఫూర్తి నేటితరానికి మార్గదర్శకమన్నా రు. స్వాతంత్య్రం అనంతరం దేశంలోని సంస్థానాలను విలీనం చేసి అఖండ భారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ఆయన దూరదృష్టి, నాయకత్వ లక్ష ణాలు ఆదర్శప్రాయమన్నారు. పటేల్ ఆలోచనలు, ఆశయాలు, స్ఫూర్తి నేటితరాని కి మార్గదర్శకంగా నిలుస్తాయని, ముఖ్యంగా యువత ఆయన జీవితాన్ని ఆద ర్శంగా తీసుకుని దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు కృషి చేయాలని సూచిం చారు. ప్రతీ ఒక్కరు భారతీయులమనే భావనతో ఐకమత్యంగా ఉండాలని, జాతి ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరు తమవంతు కృషి చేయడమే పటేల్‌కు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, ఆర్‌ఐ లు సురేష్, రమేష్, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వర్‌రావు, మధుకర్, ఎస్‌ఐలు, అర్‌ఎస్ ఐలు పాల్గొన్నారు.
17వ పోలీస్ బెటాలియన్‌లో..
సిరిసిల్ల అర్బన్ : భారత దేశ స్వాతంత్య్ర సమరంలో సర్దార్ వల్లభాయ్ పటే ల్ కీలక పాత్ర పోషించి గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని 17వ పోలీస్ బెటా లియన్ కమాండెంట్ పీజేపీసీ ఛటర్జీ అన్నారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని సర్ధా పూర్ శివారులోని 17వ పోలీస్ బెటాలియన్‌లో శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వల్లభా య్ పటేల్ చిత్రపటానికి కమాండెంట్ ఛటర్జీ పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయిం చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎంఐ సురేష్, అడ్మినిస్ట్రే టివ్ అధికారి నాగమణి, అసిస్టెంట్ కమాండెంట్‌లు జె. రాందాస్, ఎం.రాజు బెటాలి యన్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.