గడువులోగా ‘సర్’ పూర్తి చేయాలి
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:12 AM
మండలంలో సర్ (ఎస్‌ఐఆర్) కార్య క్రమాన్ని నిర్ణీత గడువులోగా వందశాతం పూర్తి చేయాలని డీఆర్‌వో రాజశ్రీ అధికారులను ఆదేశించారు.
చందుర్తి జూలై 11 (ఆంధ్రజ్యోతి): మండలంలో సర్ (ఎస్‌ఐఆర్) కార్య క్రమాన్ని నిర్ణీత గడువులోగా వందశాతం పూర్తి చేయాలని డీఆర్‌వో రాజశ్రీ అధికారులను ఆదేశించారు. చందుర్తి మండలం మల్యాల, కట్ట లింగంపేట గ్రామాల్లో సర్ కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ సర్ గడువులోగా అధికారులు, సిబ్బం ది సమన్వయంతో సర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచిం చారు. ఆర్‌ఐలు, జిపిఓలు కీలకపాత్ర పోషించాలని, ప్రతి నిర్ణయం పార దర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, అనర్హుల పేర్లు తొలగించాలని స్పష్టం చేశారు. తక్కువ నమోదు జరిగిన పోలింగ్ కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో పరి శీలన చేపట్టి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ దరఖాస్తు లను పూర్తి చేయాలని ఆదేశించారు. రోజు ఫారాలను డిజిటలైజేషన్ చేయాలన్నారు దరఖాస్తుల డిజిటలైజేషన్ పురోగతిని ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ భూపతి, ఆర్‌ఐ శ్రీనివాస్, జీపీవో చాంద్‌పాషా పాల్గొన్నారు.