వర్షాలు కురిసిన తర్వాతనే మొక్కలు నాటాలి
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:57 PM
వర్షాలు కురిసిన తర్వాతనే నాటేందుకు అవసరమైన మొక్కలను అధికారులు సిద్ధం చేసి పెట్టుకోవా లని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : వర్షాలు కురిసిన తర్వాతనే నాటేందుకు అవసరమైన మొక్కలను అధికారులు సిద్ధం చేసి పెట్టుకోవా లని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యంపై జిల్లా అటవీశాఖ అధి కారి సత్యనారాయణతోపాటు పలు శాఖల అధికారులతో సమీక్ష సమావే శాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వివిధ పథకాల కింద గతంలో నాటిన మొక్కలు ఎండిపోయినా, పెరగకపోయినా వాటిని అటవీ శాఖ అధికా రులు పరిశీలించాలని సూచించారు. వర్షాలు కురిసిన తర్వాతనే ఏర్పాటు చేసి వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నీటిపారుదల శాఖ స్థలాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అటవీప్రాంతా లు, మున్సిపల్ డంపింగ్‌యార్డులు, అటవీ అర్బన్‌పార్క్, ఎక్సైజ్ శాఖ, నూతన రహదారుల వెంట మొక్కలు నాటేందుకు గంతులు తవ్వి సిద్ధం గా ఉంచాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో నర్సరీలు ఉండాలని స్పష్టం చేశారు. వనమహోత్సవంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన మొక్కల లక్ష్యం 8లక్షల 65వేల 200 నిర్ణయించా మన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, జిల్లా విద్యాధికారి మొండయ్య, జిల్లా వైద్యాధికారి ఎంజేలా ఆల్ర్ఫెడ్, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, జిల్లా ఎక్సైజ్ అధికారి హిమశ్రీ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, మైనింగ్ శాఖ ఏడీ కాంత్రికుమార్, మున్సిపల్ కమిషనర్‌లు ఖదీర్ పాషా, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.