సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:30 AM
సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల అగ్రికల్చర్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో మాతా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు(నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం-2013 (పోష్ యాక్ట్) అనే సామాజిక ఇతివృత్తంతో ఈ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ దంపతులు పాల్గొని, మహిళా ఉద్యోగినులు వేసిన ముగ్గులను ఆసక్తిగా తిలకించారు. విజేత లకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్ర మంలో కలెక్టరేట్ ఏవో హకీమ్, అదనపు కలెక్టర్ రాజగౌడ్, డీబ్య్లూవో నరేష్, టీఎన్జీవో అధ్యక్షుడు నాగేంధర్‌రెడ్డి, ఎంపీవో రవిబాబు, సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ అధ్య క్షురాలు అరుణ, కార్యదర్శి నారాయణ, ఈడీఎం మమత పాల్గొన్నారు.
ఫకలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు చిన్నారులకు భోగి(రేగు)పండ్లు నెత్తి నపోశారు. అనాది నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తుందని వారు తెలి పారు. భోగిపండ్లపై ఎన్నో పురాణకథలు ప్రాచుర్యంలో ఉన్నట్లు తెలిపారు.