Share News

అంబరాన్నంటిన సంక్రాంతి వేడుకలు

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:28 AM

సంబరాల సంక్రాంతి సిరిసిల్ల,వేములవాడ పట్టణాలతో పాటు పల్లెల్లో సందడి నింపింది.

అంబరాన్నంటిన సంక్రాంతి వేడుకలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సంబరాల సంక్రాంతి సిరిసిల్ల,వేములవాడ పట్టణాలతో పాటు పల్లెల్లో సందడి నింపింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు, ఆత్మీయుల కలయికలతో ఏంతో ఉత్సాహంగా మూడు రోజుల పండగను జరుపుకున్నారు. సంక్రాంతి మూడు రోజుల విశిష్టమైన పండుగ భోగి, మకర సంక్రాంతి, శుక్రవారం కనుమతో పండుగ సంబరాలను ఘనంగా ముగిసింది. గురువారం సంక్రాంతి పండుగను పల్లెల్లో రైతులు కూడా పచ్చని వరి పొలాలు, గెలిగింతలు పెట్టే చలిగాలులు.. అప్యాయతలు, బం ధుమిత్రుల పలకరింపులతో ఆనందంగా గడిపారు. జిల్లాలో సకినాలు, గారెల పిండి వంటల ఘుమఘుమలు ఇంటి ముంగిట రంగురంగుల ము గ్గులు శోభనిచ్చాయి. గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా సంక్రాంతి అనుభూతులను నింపింది. నోములు నోచుకోవడంలో మహిళలు, పొంగల్‌ వేడుకల్లో యువతులు పతంగులతో పిల్లలు సందడి చేశారు. జిల్లాలోని పట్టణాలతో పాటు మండలాల్లో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. పలు కాలనీల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అంద జేశారు. కొన్నిచోట్ల దూరప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు, స్నేహితులు సమ్మేళనాలు నిర్వహించుకున్నారు.

వేములవాడ టౌన్‌ : వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రత్యేక పూజలు చేశారు. గురువారం సంక్రాంతి పర్వదినాన ఆలయానికి వచ్చిన ప్రభుత్వ విప్‌కు ఆలయ ఇవో రమాదేవి, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు శేషవస్త్రాలు కప్పి స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, వైస్‌చైర్మన్‌ కనికరపు రాకేష్‌లు పాల్గొన్నారు.

వేములవాడ : సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకుని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ గురువారం పలు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా సంప్రదాయబద్దంగా గంగిరెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని అయ్యప్ప ఆలయం, సాయిబాబా ఆలయాలకు వెళ్లి శ్రీస్వామి వారలను దర్శించుకున్నారు. పట్టణంలో నిర్వహించిన క్రికెట్‌ పోటీలకు హా జరై పోటీలను ప్రారంభించారు. వెంట కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి : సంక్రాంతి సంబురాలు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో గురువారం ఘనంగా జరిగాయి.మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాల్లోని యువజన సంఘాల ఆధ్వర్యంలో ముగ్గులు, క్రికెట్‌, వాలీబాల్‌ పోటీలను నిర్వహించా రు. తహసీల్దార్లు సుజాత, ముక్తార్‌పాషా, ఎంపీడీవోలు సత్తయ్య, శ్రీలేఖ, సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐలు రాహుల్‌రెడ్డి, లక్ష్మణ్‌, ఏఎంసీ చైర్మన్లు సబేరాబేగం, రాములు, సెస్‌ డైరెక్టర్లు కృష్ణహరి, మల్లేశం, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సయ్యలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

చందుర్తి : మండల కేంద్రంలోని మహాలక్ష్మి అలయం అలయం ఎదుట, రామన్నపేట గ్రామాల్లో గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. చందుర్తిలో యువతీ యువకులకు మ్యూజికల్‌ చైర్‌, చంచా పరుగు, కుండ కొట్టుట పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పులి సత్తయ్య, పోతరాజు భారతి-నగేష్‌, ఉపసర్పంచ్‌ బత్తుల కాంత్రి, గణేష్‌, నాయకులు బాశేట్టి భాస్కర్‌, అత్తెన మహేందర్‌, మర్రి రమేష్‌ తదితరులు పాల్గోన్నారు.

కోనరావుపేట : మండలంలోని కనగర్తిలో రైతులు కాట్రేవుల పండు గను నిర్వహించారు. పశువుల కొమ్ములకు తైలాలను పూసి అందంగా అలంకరణ చేశారు. పందిరి వేసి పశువుల కాపరిగా బావించే కాటమరాజు ప్రతిమ, పశువుల ప్రతిమలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి నైవేద్యా లు సమర్పించారు. పూజించిన జలాలను పశువులపై చల్లారు.

Updated Date - Jan 17 , 2026 | 12:28 AM