సంజీవయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:39 AM
ఉమ్మడి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. శని వారం దామోదరం సంజీవయ్య విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఆధ్వర్యంలో దామోదరం సంజీ వయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పాతబస్టాండ్ సమీపంలో ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈసందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడారు. ఉమ్మ డి రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య చేసిన సేవలు మరవలేమన్నారు. కార్యక్రమంలో మాలమ హానాడు జాతీయకార్యదర్శ రాగుల రాములు, శాలివాహన నాయకుడు నెల్లుట్ల కనకయ్య, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యవ ర్గసభ్యుడు సోమిశెట్టి దశరథం, ఎస్సీ సబ్‌ప్లాన్ జిల్లా అధ్య క్షుడు కంసాల మల్లేశం, రెడ్డమల్ల భాను, కొంపెల్లి విజయ్ కుమార్ నాయకులు బిట్ల ప్రసాద్, పంగ రవి, రమేష్, పెరుమాండ్ల సంతోష్ పాల్గొన్నారు.