‘పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వహించాలి’
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:43 AM
పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వహించి స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిదాలని కలెక్టర్ సత్యప్రసాద్ మున్సిపల్ అధికారులకు సూచించారు.
కోరుట్ల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వహించి స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిదాలని కలెక్టర్ సత్యప్రసాద్ మున్సిపల్ అధికారులకు సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని శ్మశాన వాటిక, డంపిగ్ యార్డులతో పాటు వివిధ వార్డులలో పారిశుద్ద్య పనులను కోరుట్ల ఆర్‌డీఓ జీవాకర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలుకుండా చెత్త సేకరణ చేయాలని సూచించారు. పారిశుద్ద్య పనుల నిర్వహనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. చేత్తను శాస్త్రీయ పద్దతిలో నిర్వహించి పరిసర ప్రాంతాలు దుర్వాసన, కాలుష్యం లేకుండా చర్యలు చెపట్టాన్నారు. డంపిగ్‌యార్డు పరిసర ప్రాతాలలో పరిశుభ్రంగా కాపాడుతూ పర్యవరణకు హనీ కలుగకుండా చర్యలు తీసుకో వాలన్నారు. శ్మశాన వాటికలో నీటి సౌకర్యం అవసరమైన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి మౌళిక వసతులను కల్పించాలని సూచించారు. ప్రజలు ఉపయోగించే ప్రదేశం కావడంతో అవసరమైన సదుపా యాలను మెరుగుపర్చాలన్నారు. శ్మశాన వాటికలో పరిశుభ్రతను నిరంతరం కొనసాగించాలని సంబదిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రవీంధర్, మున్సిపల్ డీఈ సురేష్, టౌన్ ప్లానింగ్ అధికారి ప్రవీణ్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆశోక్, రాజేంద్రర్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.