రేణికుంటలో ఇసుక రీచ్ ప్రారంభం
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:50 PM
మండలంలోని రేణికుంట గ్రామంలో గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను శనివారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు.
తిమ్మాపూర్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని రేణికుంట గ్రామంలో గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను శనివారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇసుక రీచ్ ద్వారా స్థానిక యువతకు, గ్రామ ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. రీచ్ నిర్వహించడం వల్ల గ్రామానికే కాకుండా రాష్ట్రానికి కూడా ఆదాయం సమకూరుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా కార్యకలాపాలు నిర్వహించాలని అన్నారు. ఇసుక ట్రాక్టర్లు నడుపుకొని జీవనం సాగించే వారికి ఇదొక మంచి అవకాశమని, మద్యం తాగి ట్రాక్టర్లు నడిపి ప్రమాదాల భారిన పడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ఎల్‌ఎండీ ఎస్సై సయ్యద్ అన్వర్, సర్పంచ్ ఎలుక అంజనేయులు, ఉప సర్పంచ్ ల్యాగల దేవేందర్ రెడ్డి, గనుల శాఖ, ఇతర శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.