సహారా ఇండియాలో జమ చేసిన డబ్బులు చెల్లించాలి
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:41 PM
సహారా ఇండియాలో ప్రజలు జమ చేసుకున్న డబ్బులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల అర్బన్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : సహారా ఇండియాలో ప్రజలు జమ చేసుకున్న డబ్బులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైన గర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మికభవనంలో సోమవారం ఏర్పాటు చేసిన సమా వేశంలో రమేష్ మాట్లాడారు. సహారా ఇండియాలో యజమాని సుబ్రతోరాయ్ వేలాది కోట్ల రూపాయలు ప్రజల నుంచి ఎక్కువ వడ్డీ ఆశ చూపి వసూలు చేశాడన్నారు. ఈ కంపెనీలో ప్రజలు రూ.50వేల నుంచి 10లక్షల వరకు జమ చేశారన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో వేలాదిమంది ఇందులో డబ్బులు జమచేసి ఇబ్బందులు పడుతూ ఆ కంపెనీని నమ్మి మోసపోయారన్నారు. భవిష్యత్తులో అవసరాల కోసం జమ చేసుకున్న డబ్బులు సహారా కంపెనీ ముంచిందని ఆవే దన పడుతున్నారని పేర్కొన్నారు. ఆ కంపెనీ మూతపడి రెండు సంవత్సరాలు గడుస్తోందని, ఆ కంపెనీ ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, వెంటనే వాటిని అమ్మి ప్రజలకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు విమల, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, దాసరి రూప, అడెపు రజితలు పాల్గొన్నారు.