Share News

భద్రతా ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - May 15 , 2026 | 12:11 AM

బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని, బ్యాంకు అధికారులు, సిబ్బంది పోలీస్‌ అధికారులతో సమన్వంలో పనిచేస్తే నేరాలను సమర్థవంతంగా నియం త్రించవచ్చని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు.

భద్రతా ప్రమాణాలు పాటించాలి

సిరిసిల్ల అర్బన్‌, మే 14 (ఆంధ్రజ్యోతి) : బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని, బ్యాంకు అధికారులు, సిబ్బంది పోలీస్‌ అధికారులతో సమన్వంలో పనిచేస్తే నేరాలను సమర్థవంతంగా నియం త్రించవచ్చని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం డీఎస్పీ కార్యాలయంలో సిరిసిల్ల సబ్‌డివిజన్‌ పరిధిలోని బ్యాంకు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడు తూ బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ప్రతి ఏటీఎం కేంద్రంలో సెక్యూరిటీ గార్డు, నాణ్యమైన సీసీ కెమెరాలు, అలారం సిస్టంలను ఏర్పాటు చేయాలని తెలిపారు. దోపిడీ లేదా అనుమానాస్పద ఘటనల సమయంలో సిబ్బంది ఎలా స్పందించాలనే విషయం పై ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. బ్యాంకులోకి వచ్చే వ్యక్తు లను తనిఖీ చేసేందుకు ప్రవేశ ద్వారం వద్ద డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌లను ఏర్పాటుచేయడంతో పాటు, గార్డులకు హ్యాండ్‌ మెటల్‌ డిటెక్టర్‌ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. రాత్రి సమయల్లో ఏటీఎంలలో నగదు తక్కువ ఉండేలా చూసుకోవాలని, ఏటీఎంలలో నగదు నింపే సమయంలో స్థానిక పోలీస్‌ అధికా రులకు సమాచారం అందిస్తే, ఆ ప్రాంతంలోని బ్లూకోల్డ్స్‌, పెట్రోకార్‌ సిబ్బందిని అప్రమత్తం చేస్తారన్నారు. ప్రతిబ్యాంకు అధికారి, సిబ్బందికి సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారుల ఫోన్‌ నంబర్లు తప్పనిసరిగా తెలిసి ఉండాలని సూచించారు. సెక్యూరిటీ గార్డును బ్యాంకు లేదా సెక్యూరిటీ ఏజెన్సీ నియమించినప్పటికీ వారి పూర్తి వివరాలు, ఫోటోలు బ్యాంకు వద్ద భద్రపరచాలని తెలిపారు. కొత్తగా తాత్కాలిక ప్రాతిపదికన నియమితులయ్యే సిబ్బంది విషయంలో మరింత అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకుల లోపల, పరిసర ప్రాంతాల్లో అను మానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీస్‌ వారికి సమాచారం అందిం చాలని బ్యాంక్‌ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల టౌన్‌ సీఐ శ్రీనివాస్‌, బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 12:11 AM