Share News

‘అభయ’ యాప్‌తో ప్రయాణికులకు భద్రత

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:04 AM

ప్రయాణిల భద్రతకు అభయ యాప్‌ మరింత భరో సా కల్పిస్తుందని, ఆటోల డ్రైవర్‌లు ట్రాఫిక్‌ నిబంధ నలు పాటించి పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణం చేయడం నేరమని ఎస్పీ మహేష్‌ బీ గీతే అన్నారు.

‘అభయ’ యాప్‌తో ప్రయాణికులకు భద్రత

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి) : ప్రయాణిల భద్రతకు అభయ యాప్‌ మరింత భరో సా కల్పిస్తుందని, ఆటోల డ్రైవర్‌లు ట్రాఫిక్‌ నిబంధ నలు పాటించి పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణం చేయడం నేరమని ఎస్పీ మహేష్‌ బీ గీతే అన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం పోలీస్‌ శాఖ అధ్వర్యంలో అమలుచేస్తున్న అభయ యాప్‌ ఫేజ్‌-3 కార్యక్రమం లో భాగంగా వంద ఆటోలకు అభయ క్యూఆర్‌ కోడ్‌ లను అనుసంధానం చేసి డ్రైవర్‌లకు ప్రమాద బీమా పత్రాలను ఎస్పీ అందజేశారు. ఈసందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ ప్రయాణికులకు సురక్షిత ప్రయాణంపై మరింత నమ్మకం కల్పించడంతో పాటు ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆటోలో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు తాము సురక్షితంగా ప్రయాణిస్తున్నా మనే నమ్మకం కలిగేలా ఆటో డ్రైవర్‌లు వ్యవహ రించాలని సూచించారు. అభయయాప్‌తో ఆటోలకు ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌లను అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులు ఆటో వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అభయ యాప్‌తో ఆటోలో ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే డ్రైవర్‌ల ఫోటో, ఫోన్‌ నంబర్‌, వాహన వివరాలు అందుబాటులోకి వస్తాయని, అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కాల్‌, ఫిర్యాదుచేస్తే వాహనం లైవ్‌ లొకేషన్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరి, సమీప పోలీసులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపడుతారన్నారు. మహిళలు, ప్రయాణి కులు ఆటో ఎక్కే ముందు తప్పనిసరిగా క్యూఅర్‌ కోడ్‌ స్కాన్‌ చేసుకోవాలని, అలాగే ర్యాష్‌ డైవ్రింగ్‌, డ్రంకెన్‌డైరవ్‌, అసభ్య ప్రవర్తన, హిట్‌అండ్‌రన్‌ ఘట నలు ఆటోలో మరిచిపోయిన వస్తువులపై కూడా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆటో డైవ్రర్లు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధన లు పాటించాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిం చుకోవద్దని సూచించారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ బా ధ్యతాయుతంగా వ్యవహ రించా లని కోరారు. అలాగే ఆటోడైవ్రర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభయ యాప్‌తో వాహనాల డ్రైవర్‌లకు రూ.50తో యాక్సిడెంటల్‌ డెత్‌కు రూ. లక్ష రూపాయల ఇన్సూరెన్స్‌ వచ్చేలా ఒక సంస్థతో అనుసంధానం చేసి ప్రమాద బీమా పత్రాలు అం దించామన్నారు. దీనిని ప్రతి సంవత్సరం రూ.50తో రిన్యూవల్‌ చేసుకోవాలని సూచించారు. ప్రమాద బీమా ద్వారా ఆటో డ్రైవర్‌ల కుటుంబాలకు భద్రత కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో ఆర్‌.ఐ సురేష్‌, ఆర్‌.ఎస్‌.ఐ శ్రీనివాస్‌, ఎస్‌.ఐ శ్రీనివాస్‌, అభిచరణ్‌, ఆటో డైవ్రర్లు ఉన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 12:05 AM