Share News

రోడ్డు భద్రత నియమాలతో సురక్షిత ప్రయాణం

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:33 AM

రోడ్డు భద్రత నియమాలు పాటిం చడం ద్వారా సురక్షిత ప్రయాణం చేయవచ్చని ఎస్పీ మహేష్‌ బిగితే సూచించారు.

రోడ్డు భద్రత నియమాలతో సురక్షిత ప్రయాణం

సిరిసిల్ల, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు భద్రత నియమాలు పాటిం చడం ద్వారా సురక్షిత ప్రయాణం చేయవచ్చని ఎస్పీ మహేష్‌ బిగితే సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో అరైవ్‌-అలైవ్‌లో భాగంగా సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్‌ వరకు యువకు లు, విద్యార్థులు, క్రీడాకారులు వివిధ వర్గాల ప్రజలు రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో ధ్వంసమైన వాహనాలను ప్రదర్శనకు నిలి పారు. ప్రమాదానికి గురైన వాహనాలను చూపుతూ డీఎస్పీ నాగేంద్ర చారి ఇతర పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్‌ బి గితే మాట్లాడుతూ అరైవ్‌ అలైవ్‌ భాగం గా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహి స్తున్నామని, వాటి ఫలితంగా గడిచిన సంవత్సరంలో మొదటి, మూడు నెలలతో పోల్చుకుంటే రెండు నెలల్లో సిరిసిల్ల సబ్‌- డివిజన్‌ పరిధిలో 42 శాతం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడం సంతోషకరమైన విషయమని ముఖ్యంగా ఇల్లంతకుంట,వీర్నప ల్లి మండలాల్లో జీరో ప్రమాదాలు నమోదు కావడం ప్రజల అవగాహనకు నిదర్శనంగా నిలిచిందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ రోడ్‌ సేఫ్టీ కమిటీలు గ్రామాల్లో ఉన్న రహదారి భద్రతా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.రోడ్డు ప్రమాదాలకు 80 శాతం ప్రధానంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్‌ స్పీడ్‌, హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, రాంగ్‌ రూట్‌లో ప్రయాణించడం, మైనర్‌ డ్రైవింగ్‌ అన్నారు. రోడ్డు భద్ర త నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని గోల్డెన్‌ అవర్‌గా చెప్పే మొదటి గంటలో ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం రూ 25వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తుందన్నారు. ఈ పథకానికి సంబంధించి రెండు దరఖాస్తులు అందగా, వాటిని కలెక్టర్‌కు పంపిం చామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, జిల్లా రవా ణా శాఖ అధికారి శ్రీనివాస్‌, సీఐలు శ్రీనివాస్‌, నాగేశ్వరరావు, వెంకటేష్‌, ఎస్‌ఐలు నాగరాజు,ఉపేందర్‌, ఎంవీఐ వంశీ ధర్‌, అసిస్టెంట్‌ ఎంవీఐ పృధ్విరాజ్‌ వర్మ, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:33 AM