Share News

స్పష్టమైన కంటిచూపుతోనే సురక్షిత డ్రైవింగ్‌

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:48 AM

స్పష్టమైన కంటి చూపు ఉంటేనే డ్రైవర్లు సురక్షితంగా డ్రైవింగ్‌ చేస్తూ గమ్యస్థానాలకు చేరుకుం టారని ఎస్పీ మహేష్‌ బీ గీతే అన్నారు.

స్పష్టమైన కంటిచూపుతోనే సురక్షిత డ్రైవింగ్‌

సిరిసిల్ల అర్బన్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): స్పష్టమైన కంటి చూపు ఉంటేనే డ్రైవర్లు సురక్షితంగా డ్రైవింగ్‌ చేస్తూ గమ్యస్థానాలకు చేరుకుం టారని ఎస్పీ మహేష్‌ బీ గీతే అన్నారు. సిరిసిల్ల పోలీస్‌ స్టేషన్‌లో శని వారం డ్రైవర్‌లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ మహేష్‌ బీ గీతే పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఈ వైద్యశిబిరంలో పలు కంటి అసుపత్రులకు చెందిన డాక్టర్‌లు పాల్గొని డ్రైవర్‌లకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలను ఎస్పీ అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్‌-అలైన్‌ అనే కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని డ్రైవర్‌లకు ఉచితంగా కంటి వైద్యపరీక్షలు చేయ డం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్‌ల ప్రాత కీలకమన్నారు. వయస్సు పెరిగే కొద్ది కంటిచూపు మందగించడం సహ జమని ముఖ్యంగా ప్రజలను తరలించే ప్యాసింజర్‌ వాహనాలకు చెంది న డ్రైవర్‌లు తమ కంటి చూపుపై మరింత శ్రద్ధ వహించాలని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణీకులను వారి గమ్య స్థానాలకు క్షేమంగా చేరవేయాల్సిన బాధ్యత డ్రైవర్‌లపై ఉందన్నారు. కంటిచూపుతో భాధపడే వారు వాహనాలు నడుపడంతో రోడ్డు ప్రమా దాలు జరిగే అస్కారం అధికమన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, టౌన్‌ సీఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 12:48 AM