Share News

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:49 PM

కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ ఎం థామస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ ఎం థామస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సమ్మెకు సన్నాహకంగా కరీంనగర్‌-1, కరీంనగర్‌-2 డిపో ఎదుట కార్మికులు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పే స్కేల్‌, ఉద్యోగ భద్రత, ఉద్యోగ నియామకాలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్మికులంతా సమ్మెకు సమాయత్తం కావాలని, యూనియన్లకు అతీతంగా సమ్మెలో పాల్గొనాలని పిలపునిచ్చారు. యాజమాన్యం బెదిరింపులకు లొంగవద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్‌ ఎంపీ రెడ్డి, జిల్లా వైస్‌ చైర్మన్‌ కె కొమురయ్య, శంకర్‌రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు సమ్మయ్య, కాళీదాస్‌, బి మహేశ్వర్‌, పి సుజాత, వి అనిల్‌, మధు, రాహుల్‌, శ్రీకాంత్‌, ప్రవీణ్‌, పీఆర్‌ గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:49 PM