Share News

ఆర్టీసీ కార్మికులవి న్యాయమైన కోర్కెలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:17 AM

ఆర్టీసీ కార్మి కులవి న్యాయమైన కోరికల ను ప్రభుత్వం ఆమోదిం చాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

ఆర్టీసీ కార్మికులవి న్యాయమైన కోర్కెలు

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ కార్మి కులవి న్యాయమైన కోరికల ను ప్రభుత్వం ఆమోదిం చాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్‌లో ఆర్టీసీ జేఏసీ శిబిరాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు సంద ర్శించి సమ్మెకు మద్దతు తెలిపారు.అనంతరం నర్సం పేట ఆర్టీసీ డిపోకు చెందిన శంకర్‌గౌడ్‌ ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతిచెందగా ఆయన చిత్రపటానికి నాయకులు నివాళు లర్పించారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడారు. అధి కారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిందన్నారు. రెండున్నర సంవత్స రాలు గడిచిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్టీసీని పటిం చుకోలేదని ఆర్టీసీని నష్టాలోకి నెట్టాడని ఆరోపించారు. కార్మికుల కృషితోనే రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం అమలు జరిగిందన్నారు. ఆర్టీసీ జేఏసీ పెట్టిన డిమాండ్లు న్యాయమైనవని వెంటనే ప్రభుత్వం జేఏసీని చర్యలకు పిలవాలి 32 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా కార్మికుల డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింప జేయాల న్నారు. కార్మికుడు శంకర్‌గౌడ్‌ ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా బీఆర్‌ఎస్‌ బావిస్తుందని శంకర్‌గౌడ్‌ కుటుంబా న్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి మద్దతునిస్తుం దన్నారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ నాయకులు స్థానిక ఆర్టీసీ డిపో గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమం లో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కార్మి క విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనవాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దార్ల సందీప్‌, కౌన్సిలర్లు, నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

వేములవాడ : వేములవాడ ఆర్టీసీ కార్మికులు చేపట్టి న సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. వరంగల్‌ ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో ఆర్టీసీ కార్మికులు డిపో ముందు ఘన నివాళి అర్పించారు. అనంతరం మౌన ప్రదర్శనతో గేట్‌ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నాకు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏనుగు మనోహర్‌రెడ్డి, బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించారు. అనంతరం మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ఎన్నికల్లో దొంగ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింద ని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను విశ్మరించిందని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న ఆర్టీసీ కార్మికుల బ్రతుకులు ఏ మాత్రం మారలేదని, ప్రభుత్వం వహిస్తున్న మొద్దు నిద్ర కు వరంగల్‌ జిల్లాలో శంకర్‌ అనే డ్రైవర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాం డ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాం డ్‌ చేశారు.

అస్వస్థతకు గురైన మహిళా కండెక్టర్‌

వేములవాడ ఆర్టీసీ డిపో ఎదుట మౌన ప్రదర్శనతో ధర్నా చేస్తున్న సమయంలో రమాదేవి అనే మహిళ కండెక్టర్‌ అస్వస్థతకు గురై కుప్పకూలింది. అక్కడే ఉన్న తోటి ఆర్టీసీ కార్మికులు, పోలీసు సిబ్బంది గమనించి 108 ద్వారా స్థానిక ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తర లించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కండెక్టర్‌ రమాదేవిని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఏనుగు మనోహర్‌ రెడ్డి పరమార్శించారు. వారి వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు నీలం శేఖర్‌, మామిండ్ల కనుకరాజు, సిరిగిరి చందు, మా రం కుమార్‌, క్రాంతి, వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 12:17 AM