Share News

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:22 AM

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌-1 డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు ఆదివారం నిరసన తెలిపారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

భగత్‌నగర్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌-1 డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుఉతూ జూన్‌ 2న ఆర్టీసీ ఉద్యోగులందరిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింట్‌మెంట్‌ డేట్‌ ప్రకటించాలన్నారు. ప్రభుత్వం స్పందించక పోతే మరో ఉద్యమానికి ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ చైౖర్మన్‌ జి మనోహర్‌, రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు, జేఏసీ కన్వినర్‌ ఎస్‌ భూజేందర్‌, కేకే రెడ్డి, జి మల్లయ్య, ఎన్‌ఎం రెడ్డి, జంపన్న, రాజేందర్‌ పాల్గొన్నారు.

ఫ హుజూరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 01 , 2026 | 12:22 AM