Share News

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:49 AM

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ లను అమలు చేస్తూ వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సిరిసిల్ల ఆర్టీ సీ డిపో చైర్మన్‌ బాణయ్య అన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్ర జ్యోతి): అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ లను అమలు చేస్తూ వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సిరిసిల్ల ఆర్టీ సీ డిపో చైర్మన్‌ బాణయ్య అన్నారు. మంగళ వారం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది సమావేశంలో సిరిసిల్ల ఆర్టీసీ డిపో జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. చైర్మన్‌ బాణ య్య, వైస్‌ చైర్మన్‌ బి శ్రీనివాస్‌, కన్వీనర్లు వీ రాజేందర్‌, ఎం ముత్తయ్య, ఆర్‌ రాంచంద్రం, ఎం తిరుపతి, మహిళ కన్వీనర్లు వీ కవిత, బీ సునీత, కే సుమలతను ఎన్నుకున్నారు. అనం తరం జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్‌ బాణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన తీర్మాణం ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. డిపో లలో యూనియన్లను పునరుద్ధరించాలని 2021-25 వేతన సవరణలను తక్షణమే అమ లుచేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రాష్ట్ర జేఏసీ పిలుపునిస్తే సమ్మెకు కూడా వెనకాడ బోమని హెచ్చరించారు. జేఏసీ రాష్ట్ర సంయు క్త కార్యదర్శి జీపీ సింగ్‌, జిల్లా కమిటీ సభ్యు లు పాపారావు, రాంరెడ్డినాయక్‌,ఎంపీ కుమా ర్‌, నర్సింలు, కేపతి, మల్లేశం, రఘు, శేఖర్‌రా వు,లక్ష్మణ్‌, టీవీసిరావు, ప్రకాష్‌, సంతోష్‌, రవి, జావిద్‌హుస్సేన్‌, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:49 AM