Share News

మసీదులు, ఈద్గాల అభివృద్ధికి రూ. 7 కోట్ల నిధులు

ABN , Publish Date - May 29 , 2026 | 12:25 AM

ధర్మపురి నియోజకవర్గంలో మసీదులు, ఈద్గాల అభివృద్ధి కోసం ఏడు కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు.

మసీదులు, ఈద్గాల అభివృద్ధికి రూ. 7 కోట్ల నిధులు
మాట్లాడుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, మే 28 ( ఆంధ్రజ్యోతి ): ధర్మపురి నియోజకవర్గంలో మసీదులు, ఈద్గాల అభివృద్ధి కోసం ఏడు కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. ధర్మపురి పట్టణంలో బక్రీద్‌ పండుగ సందర్భంగా వక్ఫ్‌ బోర్డు స్థలంలో ముస్లింలను ఉద్దేశించి ఆయన గురువారం మాట్లాడారు. ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రంలో నిరుపేద ముస్లీంల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా నిరుద్యోగ యువతి, యువకులు స్వయం ఉపాధి పొందడానికి ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నట్లు వివరించారు. ధర్మపురి నియోజకవర్గంలో పదవ తరగతి, ఇంటర్‌ విద్య పూర్తి చేసిన యువతీ, యువకుల స్వయం ఉపాధి కోసం రెండు లక్షల రూపాయల రుణాలు బ్యాంక్‌ ద్వారా ఇప్పించడానికి చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ఆసక్తి కలిగి ఉన్న యువతీ, యువకులు రుణాలు పొంది స్వయం ఉపాధి పొందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన సంగనభట్ల దినేష్‌, ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన వేముల నాగలక్ష్మి, వైస్‌చైర్మన ఇందారపు రామయ్య, పట్టణ ముస్లీం కమిటీ అధ్యక్షులు ఎండీ షబ్బీర్‌, మాజీ అధ్యక్షులు ఎస్‌కే జైనొద్దీన, జిల్లా వక్ఫ్‌ బోర్డు సభ్యులు ఎండీ షబ్బీర్‌, కౌన్సిలర్లు ఒజ్జల లక్ష్మణ్‌, సంగి ఆనంద్‌, చీపిరిశె ట్టి రాజేష్‌, ముడుసుల లక్ష్మణ్‌, జంజిరికాని సువర్ణ, మండల కాంగ్రెస్‌ ఉపాధ్య క్షులు వేముల రాజేష్‌, ఆశెట్టి శ్రీనివాస్‌, జంజిరికాని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 12:25 AM