Share News

వినాయక నిమజ్జనం ఏర్పాట్లకు రూ.20 లక్షలు..

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:34 PM

సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో వినాయక నిమిజ్జనం వేడుకల ఏర్పాట్లకు మున్సిపల్‌ నుంచి రూ.20 లక్షలు కేటా యించామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్ర పాణి అన్నారు.

వినాయక నిమజ్జనం ఏర్పాట్లకు రూ.20 లక్షలు..

సిరిసిల్ల టౌన్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో వినాయక నిమిజ్జనం వేడుకల ఏర్పాట్లకు మున్సిపల్‌ నుంచి రూ.20 లక్షలు కేటా యించామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్ర పాణి అన్నారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్‌ కార్యా లయం కౌన్సిల్‌ సమావేశం మందిరంలో చైర్‌పర్సన్‌ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. కౌన్సిల్‌ సమావేశంలో 25 అంశాలతో కూడిన ఎజెండాను చైర్‌పర్సన్‌ ప్రవేశపెట్టగా కౌన్సిల్‌ సభ్యులు సమగ్రం గా చర్చించి 24అంశాలను ఆమోదించగా ఒక అంశా న్ని వాయిదా వేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ఎజెండాలోని 25 అంశాలకు గాను కౌ న్సిల్‌ సభ్యులు 24 అంశాలను ఆమోదించారని అన్నారు. రగుడు డంపింగ్‌ యార్డ్‌ అభివృద్ధికి రూ.80లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. పట్టణంలో సానిటేషన్‌ నిర్వహణలో భాగంగా రెండు ఎలక్ట్రికల్‌ ఆటోలు, ఒక జేసీబీ కొనుగోలుకే రూ. 50 లక్షలు కేటాయించామన్నారు. పట్టణంలో అత్యవసర పనులకు గాను, సీసీ రోడ్ల ప్యాచ్‌ పనులు చేపట్టడానికి రూ. 16.55 లక్షలు కేటాయించామన్నారు. రాబోయే వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకొని వినాయక నిమజ్జనం సందర్భంగా పట్టణంలో చేపట్టాల్సిన వివిధ పనులకు గాను రూ.20లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. పట్టణంలోని వార్డులలోగల పవర్‌బోర్స్‌ల వద్ద 400 ఇంకుడుగుంతల నిర్మాణం పనులకు గాను రూ.30లక్షలు మంజూరు చేశామన్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా స్ర్పేయింగ్‌ మిషిన్ల కొనుగోల్లు, దోమల నివారణకై కెమికల్స్‌ కొను గోళ్లు, ఫాగింగ్‌ మిషన్ల మరమ్మతులకు, విధి నిర్వహణలో భాగంగా పారిశు ధ్య కార్మికుల తప్పనిసరి అయిన హ్యాండ్‌ గ్లాస్‌ కొనుగోలు చేయడంకు రూ. 1.80లక్షల నిధులను కేటాయిచామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం సిరిసిల్లలో పవర్‌ బోర్లచుట్టు ఇంకుడు గుంతలు నిర్మిం చాలని సమావేశంలో తీర్మానించామన్నారు. ప్రజా సంక్షేమం పట్టణ అభి వృద్ధి ధ్యేయంగా 24 అంశాలను ఆమోదిస్తూ తీర్మానం చేయడం జరిగిం దన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎండీ ఖాదీర్‌పాషా, వైస్‌ చైర్మన్‌ దార్ల సందీప్‌, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 11:34 PM