Share News

సిరిసిల్ల బల్దియాలో అభివృద్ధి పనులకు రూ.1.87 కోట్లు

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:59 AM

సిరిసిల్ల బలియాలో వివిధ అభివృద్ధి పనులకు దాదాపు రూ 1.87 కోట్ల నిధులను కేటాయిస్తూ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

సిరిసిల్ల బల్దియాలో అభివృద్ధి పనులకు రూ.1.87 కోట్లు

సిరిసిల్ల, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల బలియాలో వివిధ అభివృద్ధి పనులకు దాదాపు రూ 1.87 కోట్ల నిధులను కేటాయిస్తూ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. వివిధ సమస్యలపై కౌన్సిల్‌ సుదీర్ఘంగా చర్చించారు. కౌన్సిలర్లు వార్డులో నెల కొన్న సమస్యలను కౌన్సిల్‌ ముందు ఉంచారు. సోమవారం చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి అధ్యక్షతన సిరిసిల్ల మున్సిపల్‌ సాధారణ సమా వేశం జరిగింది. 25అంశాలపై చర్చ జరిపి కౌన్సి ల్‌ ఆమోదం తెలిపింది. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా సిరిసిల్ల మానేరువాగు తీరంలో బతుకమ్మ నిమజ్జనం కోసం ఏర్పాట్లతో పాటు చివరిరోజు నిర్వహిం చాల్సిన కార్యక్రమాలకు కలిపి రూ.29.5 లక్షలు కేటా యించారు. ఇందులో మానేరు తీరంలోని సాయినగర్‌, నెహ్రు నగర్‌, శాంతినగర్‌ దామెరకుంట, కొత్తచెరువు, ఈదుల చెరువు,ప్రేమ్‌నగర్‌, వెంకంపేట, బతుకమ్మ ఘాట్‌ ప్రాంతాల్లో లైటింగ్‌ ఏర్పాట్లు, ఇతర పనులకు కేటాయిం చారు. విలీన గ్రామాల్లో నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్‌ కోసం రూ 5 లక్షలు, వివిధ వార్డుల్లో రోడ్లపై మొరం పోయడానికి రూ.5లక్షలు, బతుకమ్మ ఘాటు వద్ద చివరి రోజు క్రాకర్స్‌ షోకు రూ.1.50 లక్షలు ఖర్చు చేయడానికి ఆమోదం తెలిపారు. సిరిసిల్లలోని వివిధ వార్డులో మురికికాలువలు, కాలువలపై కల్వర్టులు, బతు కమ్మ పాండు, ఇతర పనులకు రూ 59లక్షలు మంజూ రుఇచ్చారు. వీధిదీపాల నిర్వహణతోపాటు పలు వార్డు ల్లో వీధిదీపాలు ఏర్పాటు కోసం రూ10లక్షలు, పట్టణం లో మురికి కాలువ నిర్మాణం, ిసీసీ రోడ్ల నిర్మాణం పను లు, ఇతర అభివృద్ధి పనులకు రూ 21 లక్షలు మంజూ రు ఇచ్చారు.

రినోవేషన్‌ రూ.42 లక్షలు

సిరిసిల్ల మున్సిపల్‌ కార్యాలయం భవనాన్ని రినోవేష న్‌ చేయడానికి రూ.42లక్షలకు ఆమోదించారు. ఇందులో మున్సిపల్‌ కార్యాలయ భవనం మరమ్మతులు, కలర్లు వేయడం, వాటర్‌ ప్రూఫ్‌ పనులకు రూ.15లక్షలు, కమిష నర్‌, ఇంజనీరింగ్‌ చాంబర్లను అనుసంధానం చేయడం వాష్‌ రూమ్‌ నిర్మాణం, ఇతర పండ్లకు సంబంధించి రూ 15 లక్షలు, భవనానికి రూ 12 లక్షలతో లిఫ్ట్‌ ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేస్తూ ఆమోదం తెలి పారు. విద్యానగర్‌, నెహ్రునగర్‌లో వైకుంఠధామాల్లో బర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మరమ్మతు పనులు, ఇతర పనులు చేపట్టడానికి రూ.10లక్షలు కేటాయించారు. దీంతో పాటు వివిధ రిపేర్లు, బిల్లుల చెల్లింపులు ట్రాక్టర్‌ ట్రాలీల మర మ్మత్తులు వంటి పనులకు అదనంగా నిధులు మంజూ రుచేశారు. ఈసందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడపడుచులు బావించే బతుక మ్మ పండుగను ఆనందోత్సవాల మధ్య ఇబ్బందులు లేకుండా జరుపుకోవడానికి బతుకమ్మ పాండు ఏర్పాటు, లైటింగ్‌, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ 29.50 లక్షల నిధులను కేటాయిస్తూ ఆమోదం తెలిపామన్నారు. 25అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాషా, వైస్‌ ఛైర్మెన్‌ దార్ల సందీప్‌, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ ఎర్రం వెంకట్రాజం, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆడేపు చంద్రకళ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

డ్రగ్స్‌ నిర్మూలనపై కౌన్సిల్‌ పతిజ్ఞ

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు భాగ స్వాములు కావాలని మున్సిపల్‌ కౌన్సిలర్లు ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణితో పాటు కౌన్సిలర్లు ప్రతిజ్ఞ చేసి డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

నేత్రదానంతో మరొకరి జీవితంలో వెలుగు..

నేత్రదానం ద్వారా మరణానంతరం మరొకరి జీవితా ల్లో వెలుగులు నింపవచ్చని, ప్రజలు స్వచ్ఛందంగా నేత్ర దానానికి ముందుకు రావాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి అన్నారు. సోమవారం సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ముందు జాతీయ నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేత్రదానంపై జిల్లా అంధత్వ నివారణ అధి కారి డాక్టర్‌ నయిమా అవగాహన కల్పించారు. ఈసంద ర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ 2లక్షల మందిపైగా చూపు లేనివారు కార్నియా మార్పిడి ద్వారా తిరిగి చూపు పొందడం కోసం ఎదురుచూస్తున్నారని, ప్రతి సంవత్సరం 20 వేల మంది కార్నియా అంథుత్వానికి గురవుతున్నారన్నారు. నేత్రదానం చేయాలనుకునేవారు మరణించిన అనంతరం వీలైనంత త్వరగా సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తే నేత్రదానం చేయడా నికి వీలు అవుతుందని అన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 01:00 AM