శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:51 PM
శాంతిభద్రతల పరిరక్ష ణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని రాజన్న జోన్-3 డీఐజీ సన్ ప్రీత్‌సింగ్ అన్నారు.
వేములవాడ రూరల్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : శాంతిభద్రతల పరిరక్ష ణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని రాజన్న జోన్-3 డీఐజీ సన్ ప్రీత్‌సింగ్ అన్నారు. వేములవాడ సబ్ డివిజన్ కార్యాలయాన్ని గురువారం ఎస్పీ మహేష్ బి.గితేతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సబ్ డివిజన్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసుల వివరాలను తెలుసుకున్నారు. దర్యాప్తులో ఉన్న, పెండింగ్ ట్రయల్‌లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించారు. పోక్సో కేసుల్లో క్వాలిటీ దర్యాప్తు నిర్వహించాలన్నారు. ప్రతీ కేసులో ఎస్‌వోపీ ప్రకారం దర్యాప్తు చేప ట్టాలన్నారు. కార్యాలయంలో 5ఎస్ అమలును పరిశీలించి ఫైళ్లను క్రమబ ద్ధంగా నిర్వహిస్తూ 5ఎస్ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేయాల న్నారు. డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో తరచూ తనిఖీలు నిర్వ హిస్తూ సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వేముల వాడ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమ గ్ర భద్రతా ఏర్పాట్లను చేపట్టాలన్నారు. ఆలయ ప్రాంగణంలో పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
భీమన్న ఆలయంలో డీఐజీ ప్రత్యేక పూజలు
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన భీమే శ్వరస్వామిని రాజన్న జోన్-3 డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ గురువారం ఎస్పీ మహేష్ బి.గితేతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డీఐజీ, ఎస్పీలకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా డీఐజీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్పీ మహేష్ బి.గితేలు కోడెమొక్కులు చెల్లిం చుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం వారికి అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా, డీఈవో ప్రతా పనవీన్ శేషవస్త్రం కప్పి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమం లో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, పట్టణ సీఐ వరప్రసాద్, ఏఈవోలు జయకుమారి, నాగుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.