Share News

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:29 AM

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం రాత్రి రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్య లపై అధికారులతో చర్చించారు. జిల్లా కేంద్రంలోని రగుడు జంక్షన్‌ వద్ద రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని, పనులు ప్రారంభించి వారంరోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాంపెల్లి జంక్షన్‌వద్ద రోడ్డు మరమ్మతు పనులు చేప ట్టాలని సూచించారు. పాఠశాలల సమీపంలో అవసర మైనచోట రంబుల్‌ స్ట్రిప్స్‌ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బీమ్లానాయక్‌, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌, జిల్లా విద్యాధికారి మొండయ్య, పీఆర్‌ఈఈ సుదర్శన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో ఏంజెలా అల్ర్ఫెడ్‌, ఎస్‌బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌లు ఖదీర్‌పాషా, లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:29 AM