మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:33 AM
మాదక ద్రవ్యాల వినియో గాలను నియంత్రణతోపాటు అరికట్టేందుకు క్షేత్రస్ధాయిలో పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశిం చారు.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : మాదక ద్రవ్యాల వినియో గాలను నియంత్రణతోపాటు అరికట్టేందుకు క్షేత్రస్ధాయిలో పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశిం చారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ చర్యలు, విని యోగం అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో అదనపు కలెక్టర్ చర్చించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేసేలా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి అవసరమైన వైద్య చికిత్సతోపాటు కౌన్సెలింగ్ అందేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆసు పత్రిలో డీ-అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రంలో మాదక ద్రవ్యాల వినియోగానికి బానిసలైన వారికి అవసరమైన వైద్య సేవలు, కౌన్సెలింగ్, మానసిక పర మైన మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్‌లు వివరిం చారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.