‘ఇందిరమ్మ బీమా’కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:13 AM
ఇందిరమ్మ కుంటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు.
కరీంనగర్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇందిరమ్మ కుంటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ, అన్ని మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం అమలవుతున్న బీమా పథకాలన్నింటిని ఇందిరమ్మ కుటుంబ బీమా పరిధిలోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. నేతన్నలు, గౌడులు, కార్మికులు, మత్స్యకారులకు ప్రస్తుతం అందిస్తున్న రెండు లక్షల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకు రావడం ద్వారా 5 లక్షల రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకం కోసం ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్లోనూ దరఖాస్తులు అందుబాటులో ఉంచాలన్నారు.