ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:35 AM
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశిం చారు.
సిరిసిల్ల, నవంబరు 18 (ఆంరఽధజ్యోతి) : రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశిం చారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండ ల పంచాయతీ అధికారులు, మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులకు సిబ్బంది కి ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలోని 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నదని వెల్లడిం చారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచా యతీల్లో విడతల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అర్జీదారుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ వివరాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. బీమా చేయించేవారు నామిని వారి వివరాలు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ నామినీలు కూడా ఉండవచ్చని వెల్లడించారు. దరఖాస్తు ఫారంలో సంతకం చేయాలని సూచించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో అధికారులు, సిబ్బంది ప్రత్యేక శిబిరాల వద్ద టెంట్లు, కుర్చీలు, బీమా వివరాల ప్లెక్సీలు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివరాల నమోదు కోసం కం ప్యూటర్లు, ఇతర యంత్రాలు, సిబ్బంది హెల్ప్ డెస్క్ ఏ ర్పాటు చేయాలన్నారు. మొత్తం ప్రక్రియలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశిం చారు. శిబిరాలను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాల న్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్య, జిల్లా ప్రణాళిక అధి కారి సంపత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పా షా, లోకేష్, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.