Share News

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:31 AM

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ అన్నారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, డ్రైవర్లకు రోడ్డు భద్రతపై బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీ వో శ్రీనివాస్‌ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారు విధిగా హెల్మెట్‌తో పాటు కార్లు, ఇతర వాహనాదారులు సీటు బెల్టు ధరించాలని అన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులు కాకూడదని అన్నారు. అతి వేగం, సెల్‌ఫోను వినియోగం తగ్గించాలని అన్నారు. సామర్థ్యానికి మించి పిల్లలు, ప్రయాణీకులను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారి ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోయి కుటుం బం మొత్తం రోడ్డున పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో జీబ్రా క్రాసింగ్‌, ట్రాఫిక్‌ సిగ్నల్‌ను గమనించాలని అన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకుని గ్రామాల్లోని ప్రజల ను చైతన్యవంతులను చేయాలని డీటీవో శ్రీనివాస్‌ అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్‌, అసిస్టెంట్‌ మోటా ర్‌వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పృథ్వీరాజ్‌వర్మ, హెచ్‌ఎం మనోహరాచారి, సర్పంచ్‌ నర్సింలు, ఉపాద్యాయులు, డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 12:31 AM