రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:38 AM
రోడ్డు ప్రమాదాల నివారణ కు భద్రత నియమాలు తప్పకుండా పాటించా లని మెట్‌పల్లి సీఐ అనిల్‌కుమార్ సూచిం చారు.
- మెట్‌పల్లి సీఐ అనిల్‌కుమార్
మెట్‌పల్లి రూరల్, జనవరి 17 (ఆంధ్ర జ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణ కు భద్రత నియమాలు తప్పకుండా పాటించా లని మెట్‌పల్లి సీఐ అనిల్‌కుమార్ సూచిం చారు. శనివారం మహిళలు మరియు కుటుంబ భద్రత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు మండ లంలోని ఆత్మనగర్ గ్రామంలో అవగాహన సదస్సును నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలను తప్పకుండా పాటిస్థామ ని గ్రామస్థులతో ఎస్సై కిరణ్‌కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఐ అనిల్ కుమార్ మాట్లాడు తూ ప్రతి వ్యక్తి సురక్షి తంగా తమ గమ్యస్థానం చేరుకోవడమే లక్ష్యంగా అరైవ్..అలైవ్.. కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపడం, సేఫ్ అండ్ డిఫెన్సింగ్ డ్రైవింగ్ పద్ధతులు అనుసరించడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు. కారు, ఇతర పెద్ద వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. వాహన దారుడి వద్ద డ్రైవింగ్ లైసెన్స, ఇన్సూరెన్స, రిజిసే్ట్రషన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని పలు సూచనలు చేశారు. కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళ సంఘాలు, గ్రామస్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్రవాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని మెట్‌పల్లి సీఐ అనిల్ సూచించారు. మండలంలోని మొగిలిపేటలో శనివారం సర్పంచ గోల్కొండ కళావతి రమేష్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక అవ గాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా స్థానికులు, పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడాపోటీల్లో గెలుపొందిన విజేతలకు కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావుతో కలిసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సై రాజు, ఉపసర్పంచ దండవేణి రాజేందర్, మండల అధ్యక్షుడు పుండ్రా శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఏలేటి జలపతిరెడ్డి, గడ్డం మైపాల్, గోల్కొండ రమేష్, డప్పుల నర్స య్య, సోమరాజు, శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, అధికారు లు, తదితరులు పాల్గొన్నారు.