Share News

రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:51 PM

రోడ్డుభద్రతా నియమాలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి

ఇల్లంతకుంట, జనవరి 3(ఆంధ్రజ్యోతి) : రోడ్డుభద్రతా నియమాలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్‌ పేర్కొన్నారు. రోడ్డుభద్రతా మాసోత్సవాల సందర్భంగా మండలకేంద్రంలోని జిల్లాపరిషత్‌ పాఠశాల ఆవరణలో శనివారం అవగాహన సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుభద్రతా నిబంధనలను ఆచరణలో పెడితే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే వాహనాలను రోడ్డుపైకి తీసుకరావాలని సూచించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌, కార్లు నడిపే వారు తప్పనసరిగా సీటుబెల్ట్‌ ధరించాలన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించి, బస్టాండ్‌ ప్రాంతంలో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. తొలుత జిల్లాపరిషత్‌ పాఠశాల పరిసరాలలో స్కూల్‌జోన్‌ బోర్డులను ఏర్పాటుచేశారు. అటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్‌, సర్పంచ్‌ మామిడి రాజు, ఎంఈవో శ్రీనివాసగౌడ్‌, ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత, మోటార్‌ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్‌, సహాయ అధికారులు రజని, పృధ్వీరాజ్‌వర్మ, ప్రైవేట్‌ పాఠశాలల కరస్పాండెంట్లు తూముకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, మధూకర్‌రెడ్డి, పండరీనాథ్‌, శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 11:51 PM