Share News

రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:43 PM

రోడ్డు భద్రతా నియమాల ను ప్రజలందరు తప్పనిసరిగా పాటించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ కోరారు.

రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు భద్రతా నియమాల ను ప్రజలందరు తప్పనిసరిగా పాటించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ కోరారు. జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూ పొందించిన భద్రతా నియమాల పోస్టర్‌లను అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ తో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి వాహనదారుల వరకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదా రులు ఖచ్చితంగా హెల్మెట్‌ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్‌ ధరించాలని పిలుపునిచ్చారు. ఓవర్‌ లోడుతో వాహనాలు వెళ్లకూ డదని, పరిమితికి మించి ప్రయాణికులను వాహనాల్లో తరలించవద్దని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలపై అందరికీ అవగాహన కల్పించేం దుకు విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించాలని, వివిధ రకాల వాహనదారులతో ర్యాలీలు తీయించాలని ఆదేశించారు. రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్లపై బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించాలని, వాటి నివారణకు ఆర్‌అండ్‌బీ శాఖ అధికా రుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్‌ మాట్లా డుతూ, మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయవద్దని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదకర మూలమలుపుల వద్ద సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్‌, ఎంవీఐ వంశీధర్‌, పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాశ్‌, ఏఎంవీఐలు రజనీ దేవి, పృథ్వీరాజ్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లా పోలీస్‌ కార్యాల యంలోనూ భద్రత అవగాహన మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను రవాణా శాఖ అధికారులతో కలిసి ఎస్పీ మహేష్‌ బీ గితే ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిం చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్‌ సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్‌, ఎంవీఐలు వంశీఽధర్‌, రజనిదేవి, ఏఎంవీఐలు పృథ్వీరాజ్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 11:43 PM