Share News

ప్రణాళిక ప్రకారం రోడ్డు భద్రతా చర్యలు అమలు

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:17 AM

జిల్లా వ్యాప్తంగా ప్రణాళిక ప్రకారం రోడ్డు భద్రతా చర్యలు అమలు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు.

ప్రణాళిక ప్రకారం రోడ్డు భద్రతా చర్యలు అమలు

సిరిసిల్ల అర్బన్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా ప్రణాళిక ప్రకారం రోడ్డు భద్రతా చర్యలు అమలు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో బుఽధవారం రోడ్డు భఽధ్రత సమావేశాన్ని ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవేస్‌, పీఆర్‌, పోలీస్‌, ట్రాన్స్‌ పోర్ట్‌, వైద్య, ఎక్సైజ్‌, విద్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో రోడ్డు భద్ర త కమిటీతో అదనపు కలెక్టర్‌ సమీక్షించారు. గతనెలలో నిర్వహించిన రోడ్‌ భధ్రత కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారుల్లో గుర్తించిన బ్లాక్‌స్పాట్స్‌ల వద్ద రం బుల్‌స్ట్రిప్స్‌, సోలార్‌ సిగ్నల్స్‌, సైన్‌ బోర్డ్‌లను ఏర్పాటు చేయాలని, రోడ్డు పైకి అడ్డుగా వచ్చిన చెట్ల కొమ్మలను తొలగించాలని సూచించారు. పలు జంక్షన్‌ ల రహదారుల్లో స్పీడ్‌గన్స్‌, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్నవాటిని మరోసారి పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్‌, ఈఈ ఆర్‌అండ్‌బీ నరసింహాచారి, ఈఈ నేషనల్‌ హైవేస్‌ సురేష్‌ రాథోడ్‌, డీటీవో లక్ష్మణ్‌, పంచాయతీరాజ్‌ ఈఈ సుదర్శన్‌రెడ్డి, నేషనల్‌ హైవే డీఈ అన్నయ్య, ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, ఎక్సైజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు, మున్సిపల్‌ కమి షనర్‌లు ఖదీర్‌పాషా, సంపత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 12:17 AM