Share News

మానేరు నీటిని విడుదల చేయాలని రాస్తారోకో

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:28 AM

నర్మాల ఎగువ మానేరు జలా శయం నుంచి పంటల సాగుకు నీరు విడుదల చేయాలని మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం రైతులు రాస్తారోకో చేపట్టారు.

మానేరు నీటిని విడుదల చేయాలని రాస్తారోకో

గంభీరావుపేట, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : నర్మాల ఎగువ మానేరు జలా శయం నుంచి పంటల సాగుకు నీరు విడుదల చేయాలని మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ఎగువ మానేరులో పంటలకు సరిపడా నీరు అందుబాటులో ఉన్నాయని, వెంట నే సాగునీటిని విడుదల చేయాలని మండల కేంద్రంతో పాటు లింగన్నపేట, నర్మాల, మల్లారెడ్డిపేట గ్రామాలకు చెందిన రైతులు ప్రధాన రహదారిపై బైఠా యించారు. నార్లు పోసుకునే సమయం అయిపోతోందని అధికారులు వెంటనే స్పందించి, నీటిని విడుదల చేయాలన్నారు. మానేరు జలాశయంలో 2 టీఎంసీల కు గాను 1.7 టీఎంసీల నీరు ప్రస్తుతం ఉందని, అందులోంచి పంటల సాగుకు అర టీఎంసీ నీరును విడుదల చేయాలన్నారు. డిసెంబరు 5 లోపు స్పందించి సాగునీటి విడుదలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అప్పటిలోగా సంబంధిత అధికారుల్లో స్పందన రాకపోతే మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులను సమీకరించి, ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. జలాశయం లో నీరు పుష్కలంగా నీరు ఉన్నా సాగుకు అందించకపోతే పంటలపై ఆధార పడ్డ తాము తీవ్రంగా నష్టపోతామన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మానేరు నుంచి నీటిని విడుదల చేయాలన్నారు. సిద్దిపేట-కామారెడ్డి ప్రధాన రహదారిపై గంటల తరబడి ఆందోళన చేపట్టడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపచేశారు. అనంతరం మానేరు నుంచి నీటిని విడుదల చేయా లని కోరుతూ తహసీల్దార్‌ మారుతిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళ నలో రైతులు ఎడబోయిన రాజు, వెంకట్‌యాదవ్‌, ఆకునూరు రాజేందర్‌, ఎండ్రా ల రవీందర్‌రావు, ఆకునూరు శ్రీనివాస్‌, కముటం వెంకటస్వామి, జక్కుల నవీన్‌, పిట్ల నర్సింలు, దుద్దెడు నారాయణ, గుండెళ్లి కళ్యాణ్‌, పంపరి మహేష్‌, దాసరి చంద్రం తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 12:28 AM