Share News

నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:13 AM

వాహనాలను నడిపే ప్రతి ఒక్కరు నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలంగాణ రాష్ట్ర రైల్వే, రోడ్డు భధ్రత ఐజీపీ రమేష్‌ నాయుడు అన్నారు.

నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : వాహనాలను నడిపే ప్రతి ఒక్కరు నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలంగాణ రాష్ట్ర రైల్వే, రోడ్డు భధ్రత ఐజీపీ రమేష్‌ నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన - ప్రగ తి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా సిరిసిల్లలో జిల్లా పోలీస్‌, రవాణా శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం అరైవ్‌-అలైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లాలోని ఆర్టీసీ, విద్యాసంస్థలు, ఆటోలు, మున్సిపల్‌ ఇతర వాహనాల డ్రైవర్‌లకు రోడ్డు ప్రమాదాల నివారణలపై అవగాహన కల్పించడంతోపాటు అందరికి ఉచితంగా ఎల్‌వీ ప్రసాద్‌ కంటి వైద్యశాఖ నేతృత్వంలో కంటి పరీక్షలు చేయించారు. అలాగే సీపీఆర్‌ ప్రథ మ చికిత్సలపై శిక్షణ అందించి చేయాల్సిన చర్యలపై అవగాహన కల్పిం చారు. అనంతరం వాహనాల డ్రైవర్‌లతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞన చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్‌ నాయుడు మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా స్పందించి ప్రాణాలు కాపాడేది వాహనాల డైవర్‌లేనని అన్నారు. ఆటోడైవ్రర్లు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ, ఆ మేరకే ప్రయాణికులను ఎక్కించు కోవాలని సూచించారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రు లు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని అలాగే విద్యార్థుల రవాణాలో డైవ్రర్లు బాధ్య తగా వ్యవహరించాలని సూచించారు. రహావీర్‌ పథకం కింద ప్రమాదాలు జరిగిన గంటలోపు బాధితులను సమీప ప్రధాన రాహదారుల వెంట ఉన్న ఆసుపత్రులకు తరలించి వారికి వారం రోజుల పాటు ఉచిత వైద్యచికిత్సలు అందిస్తూ రూ.లక్షా50వేల వరకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తోంద న్నారు. ప్రమాద సమయంలో భయపడకుండా బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి ఈ పథకం కింద రూ.25వేలు పోత్సాహకం ఇవ్వడం జరుగు తుందన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపవద్దని, ప్రతి డ్రైవర్‌ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణలో రోజుకు సుమారు70 రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయని, అందులో 20వరకు మరణాలు జరుగు తున్నాయని వెల్లడించారు. ఓవర్‌స్పీడ్‌ తప్పుగా ఓవర్‌ టేకింగ్‌ చేయడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహ నాల 80కిలోమీటర్‌ల వేగ పరిమితి లోపలే నడపాలని, ముఖ్యంగా ప్రధా న రహదారులపై ఉన్న స్పీడ్‌సైన్‌ బోర్డులను నిబంధనలను పాటించాలని సూచించారు. సీట్‌బెల్ట్‌ల ధరించకపోవడం, హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్ల నే ప్రమాదాల తీవ్రత పెరుగుతోందన్నారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మా ట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృతిచెందుతున్నారని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని అన్నారు. తమ కుటుంబాలతో పాటు పిల్లల బాధ్యతను గుర్తు పెట్టుకొని జాగ్రతగా వాహనాలను నడపాలని సూచించారు. ప్రతి నెలా రోడ్డు సేఫ్టీ కమిటీ మీటింగ్‌ ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, పోలీస్‌, రవాణా శాఖా, ఆర్టీసీ అధికా రులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు నిలయంగా ఉన్న బ్లాక్‌స్పాట్‌ల గుర్తింపు, నివారణ చర్యలు, సైన్‌బోర్డుల ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదా లు పూర్తిగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్కూల్‌ ఆటోలు, బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలించవద్దని స్పష్టం చేశారు. డ్రైవర్లకు కంటి పరీక్షలతో ఎంతో మేలని, వైద్యుల సూచన మేరకు కంటి అద్దాలను వినియోగించుకోవాలని కోరారు. ఎస్పీ మహేష్‌ బి. గితే మాట్లాడుతూ ఎక్కువ ప్రమాదాలు డ్రంకెన్‌డ్రైవ్‌తోనే అవుతున్నాయన్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లాలో రోడ్‌ సేఫ్టీ, ట్రాఫిక్‌ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో రోడ్‌ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో కొదురుపాక వంతెన చౌరస్తా, నందికమాన్‌ చౌరస్తా, వేములవాడ తిప్పాపూర్‌ బస్టాండ్‌ చౌరస్తా, సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తా, పెద్దూర్‌, ఎల్లా రెడ్డిపేట హెచ్‌పీ పెట్రోల్‌ బాంక్‌ వద్ద, తంగళ్ళపల్లి పద్మనగర్‌, సారంపల్లిలను 8 బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించామని, ఆయాప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు చేపడుతామన్నారు. వాహనాదాహరులు జాగ్రత్తగా వెళ్లాలన్నారు. జిల్లాలో వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. మైనర్లు వాహనాలు నడపవద్దని, ఒకవేళ నడిపి పట్టుబడితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. త్రిబుల్‌ రైడింగ్‌, రాంగ్‌రూట్‌ డ్రైవ్‌ చేయవద్దని సూచించా రు. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్‌ రూల్స్‌లను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మైనర్లకు వాహ నాలు ఇవ్వద్దని, మేజర్లకే జాగ్రత్తలు చెబుతూ వాహనాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్‌ కుమార్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రజిత, తహసీల్దార్‌ మహేష్‌ కుమార్‌, సీఐలు శ్రీనివాస్‌, నాగేశ్వరరావు, వెంకటేష్‌, వీరప్రసాద్‌, గాండ్ల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, మధుకర్‌, ఆర్‌ఐలు మధుకర్‌, రమేష్‌, సురేష్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 12:13 AM