స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలు దూరం
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:02 AM
స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలు దూరమవుతా యని, ప్రమాదాలు అరికట్టవచ్చని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, జిల్లా రవాణా శాఖ అధి కారి లక్ష్మణ్ అన్నారు.
సిరిసిల్ల, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలు దూరమవుతా యని, ప్రమాదాలు అరికట్టవచ్చని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, జిల్లా రవాణా శాఖ అధి కారి లక్ష్మణ్ అన్నారు. బుధవారం రాజన్న సిరి సిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అరైవ్ -అలైవ్‌లో భాగంగా పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణం చేసే సమయాల్లో చిన్నచిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయవచ్చని, ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమేనన్నారు. ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు. వాహనాలు నడిపే సమ యంలో సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయా రక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని, వాహనాలు నడిపే సమ యాల్లో మొబైల్ ఫోన్ వాడద్దని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడి తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపా రు. ప్రమాదం జరిగిన తొలి గంటను గోల్డెన్ హవర్‌గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయాని కి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చ ని పేర్కొన్నారు. జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజ లు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు. జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ రక్షిత ప్ర యాణమే లక్ష్యంగా రోడ్డు భద్రత సూచనలు పాటించాల న్నారు. ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడ పవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్, ఆర్‌టీఉ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, ట్రాఫి క్ ఆర్‌ఐ సురేష్, ఎస్‌ఐ శ్రీకాంత్, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్, ఎం వీఐ పృథ్వీదర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.