పకడ్బందీగా వృద్ధుల సంరక్షణ చట్టం అమలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:35 AM
వృయోవృద్ధుల, తల్లిదండ్రుల సంరక్షణకు చట్టం పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్ట ర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : వృయోవృద్ధుల, తల్లిదండ్రుల సంరక్షణకు చట్టం పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్ట ర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవా రం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జా తీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్‌బీగీతేలు హాజరై కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాఽధికారిత సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జీ లక్ష్మణాచారితో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా వయోవృద్ధు ల, తల్లిదండ్రుల సంక్షేమానికి అమలు చేస్తు న్న చట్టాలు, పథకాలు తదితర అంశాలపై సీనియర్ సివిల్ జడ్జీ లక్ష్మణాచారి అవగాహ న కల్పించి వృద్ధుల సంరక్షణ చట్టాలు, ఉప యోగాలపై నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ వృ ద్ధుల నుంచి గౌరవం, మర్యాద, సంస్కృతి, సంప్రదాయాలు, విశేషమైన అనుభవాలు ఇప్పటితరం ప్రజలు తెలుసుకోవాలని సూచిం చారు. వృద్ధులు తాము జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులు మొత్తం తమ పిల్లల పేరిట చేయవద్దని సూచించారు. ఒకవేళ చేయాల్సి వస్తే తమ సంరక్షణ చూడకపోతే వెనక్కి తీసుకుంటామనే నిబంధన పెట్టి చే యాలని తెలిపారు. వృద్ధ మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. జిల్లాలో 469 సంఘాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వృద్ధ మహిళలు చేరాలని, సం ఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. వృద్ధులు తమ మనుమడు, మనుమరాలుకు నీతికథలు, మంచి అలవాట్లు తెలియజేయాల ని సూచించారు. జిల్లా కేంద్రంలోని డే కేర్ సెంటర్ సేవలున్నాయని వృద్ధులు సద్విని యోగం చేసుకోవాలన్నారు. వృద్ధులు సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాల ని కోరారు. సంఘాలుగా ఉండాలని సూచిం చారు. వృద్ధులు తమకు వచ్చిన ఇబ్బందులు తెలియజేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు రావచ్చని ఎస్పీ మహేష్ బీగీతే తెలిపారు. పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అం దిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కేఎస్‌బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సౌమ్య, వృద్ద సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
వైద్యకళాశాల భవనాలు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి
జిల్లా కేంద్రంలోని వైద్యకళాశాల భవనం తోపాటు వసతిగృహాల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చి విద్యార్థులకు అవసరమై న అన్ని సదుపాయాల ను కల్పించాలంటూ అధి కారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేఽశించారు. పెద్దూర్ శివారు వైద్య కళాశాల భననాలతోపా టు బాలుర, బాలికల వ సతిగృహాల నిర్మాణాలను శుక్రవారం కలెక్టర్ పరిశీ లించారు. ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణాల పురోగతిని, ఇంకా చేపట్టాల్సిన పనులపై అడి గితెలుసుకున్నారు. బాలికల వసతి గృహం ప నులు పూర్తయ్యాయని కౌంపాండ్‌వాల్ నిర్మిం చామని, బాలుర వసతి గృహం త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకవస్తామని అధికారులు వివరించారు. కలెక్టర్ మాట్లాడు తూ ప్రణాళికాబద్ధంగా నిర్మాణ పనులను పూర్తిచేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచే స్తూ భవనాలు త్వరగా అందుబాటులోకి తీ సుకవచ్చేందుకు కృషి చేయాలని ఆదేశించా రు. కళాశాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని, పనుల పురోగతిని అధికారులు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు సదుపాయాలు కల్పించా లని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమాల్లో అర్‌అండ్‌బీ ఈఈ బీమ్లా నాయక్, వైద్య కళా శాల ప్రిన్సిపాల్ రాజేశ్వరీ, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్‌రావు తదితరులున్నారు.