ఉడకనంటున్న బియ్యం
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:53 AM
రోజురోజుకు మార్కెట్‌లో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన రెండున్నర నెలల్లోనే నాణ్యమైన సన్నరకం బియ్యం ధరలు క్వింటాల్‌కు 1500 నుంచి రెండు వేల రూపాయల వరకు పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రోజురోజుకు మార్కెట్‌లో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన రెండున్నర నెలల్లోనే నాణ్యమైన సన్నరకం బియ్యం ధరలు క్వింటాల్‌కు 1500 నుంచి రెండు వేల రూపాయల వరకు పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ఫ వరిసాగు తగ్గే అవకాశం
ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని విస్తృత ప్రచారం చేస్తోంది. నేపథ్యంలో వరిసాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది. వరి దిగుబడి పడిపోతే మార్కెట్‌లో బియ్యం ధరలు మరింత పెరుగుతాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత ఖరీఫ్‌లో ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ఽధాన్యాన్ని కొనుగోలు చేయడంతో రైతుల వద్ద ధాన్యం నిల్వలు తగ్గిపోయాయి. ధాన్యానికి డిమాండ్ పెరుగడంతో బియ్యం ధరలు అమాంతంగా పెరిగాయి. మరోవైపు సోనా మసూరి, బిపిటి, ఐఆర్-64 వంటి బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి, నిల్వలను అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలను పొందుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఫ పాతవి.. కొత్తవి అనే తేడా లేకుండా..
బియ్యం ధరలను మే 1వ తేదీతో పోలిస్తే నాణ్యతను బట్టి పాత బియ్యం 25 కిలోల బస్తాపై 200 నుంచి 300 వరకు అదనపు భారం పడుతోంది. నల్గొండ, మిర్యాలగూడ, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన బియ్యాన్ని జిల్లాలో ఎక్కువగా విక్రయిస్తారు. జైశ్రీరామ్ యాసంగి స్టీమ్డ్ రైస్ హోల్‌సెల్ ధరలు మే 1న క్వింటాల్‌కు 5,600 చొప్పున ఉండగా ఇప్పుడు ఏడు వేలకు చేరింది. హెచఎంటీ రకం క్వింటాల్ బియ్యం ధర 5,400 ఉండగా ప్రస్తుతం 6,500కు విక్రయిస్తున్నారు. ఆర్‌ఎనఆర్ క్వింటాల్ బియ్యం ధర 4,500 నుంచి ఆరు వేలకు, బీపీటీ రకం ధర నాలుగు వేల నుంచి 5,750 వరకు పెరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కొత్త బియ్యం ధరలు సాధారణంగా తక్కువ ఉంటాయి. ప్సఉ్తతం ఆ బియ్యం ధరటూ రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మార్కెట్‌లోని మేలైన రకం బియ్యం ధరలతోపాటు మధ్య రకం బియ్యం ధరలు కూడా క్వింటాల్‌కు వెయ్యి రూపాయల వరకు పెరిగాయి. రిటైల్ మార్కెట్‌లో ఈ ధరలకు తోడుగా వ్యాపారులు క్వింటాల్‌కు క్వాలిటీని బట్టి 300 నుంచి 400 వరకు పెంచి విక్రయిస్తున్నారు. రెండు నెలల క్రితం 25 కిలోల సంచి జైశ్రీరామ్ రకం బియ్యాన్ని 1,400 విక్రయించగా ప్రస్తుతం మార్కెట్‌లో 1,750 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఒక్కో సంచిపై 350 రూపాయలు పెరిగింది. బీపీటీ 25 కిలోల బ్యాగ్‌కు 1,250 ఉండగా 1,500, హెచఎంటి 25 కిలోల బ్యాగ్ 1,550 నుంచి 1,800 రూపాయల చొప్పున రిటైల్‌గా విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రేషనకార్డు ఉన్నవారందరికీ సన్నబియ్యం పంపిణీ చేయడంతో మార్కెట్‌లో బియ్యం ధరలు కొంత మేరకు తగ్గాయి. ఎల్‌నినో ప్రభావంతో బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడే బియ్యం ధరలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో క్వింటాల్ మేలు రకం బియ్యం ధర 10వేల వరకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.