Share News

రెవెన్యూ అధికారులు సమయపాలన పాటించాలి

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:59 PM

రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

రెవెన్యూ అధికారులు సమయపాలన పాటించాలి

తంగళ్లపల్లి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. మంగళవారం తంగళ్లపల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ పరిశీలించారు. మొత్తం సిబ్బంది ఎంత మంది అని ఆరా తీశారు. భూభారతి, సాదాబైనామా తరఖాస్తులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లడుతూ అధికారులు, సిబ్బంది విధులకు సమయానికి రావాలని సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని ఆదేశించారు. భూ భారతి, సాదాబైనామా కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత గువులోగా పరిష్కరించాలని తెలిపారు. కార్యాలయంలోని అన్ని ఫైళ్లను జాగ్రత్తగా భద్రపరచాలని, ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండే లా చూసుకోవాలని ఆదేశించారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజ రైన అటెండర్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

ఫర్టిలైజర్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి..

ఫర్టిలైజర్‌ యాప్‌ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు. మంగళవారం తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని గ్రోమోర్‌, నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఎంత యూరియా ఉంది..? ఎంత వచ్చింది..? ఫర్టిలైజర్‌ యాప్‌ ద్వారా రైతులు బుకింగ్‌ చేసుకున్న వివరాలు మొబైల్‌, రిజిస్టర్‌లో పరిశీలించారు. ఆయా కేంద్రా ల్లో యూరియా నిల్వలను తనిఖీ చేశారు. యూరియా తీసుకవెళ్లేందు కు వచ్చిన రైతుల ఇబ్బందులను అడిగి తెసుకున్నారు. ఎన్ని ఎకరాలు ఉంది..? ఏయే పంటలు సాగు చేశారు..? ఫర్టిలైజర్‌ యాప్‌ను వినియో గిస్తున్నారా సేవలు ఎలా ఉన్నాయని తదితర అంశాలను ఆరా తీశారు. క్యూలైన్‌లో నిలబడే ఇబ్బందులు దూరమయ్యాయని, ఎప్పుడైనా తమ కు నచ్చిన షాప్‌లో తీసుకునే అవకాశం ఉందని రైతులు కలెక్టర్‌కు వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లడుతూ రైతుల కోసం ప్రభు త్వం రూపొందించిన ఫర్టిలైజర్‌ యాప్‌ సేవలను సద్వినియోగం చేసు కోవాలని పిలుపునిచ్చారు. రైతులు తమకు నచ్చిన, అందుబాటులో ఉన్న షాప్‌ నుంచి యూరియా కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరి స్థితుల నేపథ్యంలో రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేయాలని సూచించారు. ఆయిల్‌పామ్‌ ఇతర పంటల వైపు దృష్టి సారించాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసా యశాఖ అధికారి అఫ్జల్‌ బేగం, మండల వ్యవసాయ శాఖాధికారి సం జీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 11:59 PM