నంబర్ వన్ క్రిమినల్ రేవంత్‌రెడ్డే..
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:27 AM
రాష్ట్ర వ్యాప్తంగా వున్న పాలిటెక్నిక్ కళాశాలల విలువైన భూముల, ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నేసిందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసి ల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు.
వేములవాడ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా వున్న పాలిటెక్నిక్ కళాశాలల విలువైన భూముల, ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నేసిందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసి ల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ఆగ్రహారం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను శనివారం కలుసుకున్నారు. గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుని వారి ఆవేదనను విన్నారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థుల ను క్రిమినల్ అంటూ వ్యాఖ్యానించిన రేవంత్‌రెడ్డి నంబర్ వన్ క్రిమినల్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏం చదువు చదివాడో.. ఎలా పాసయ్యాడో తెలియదు కానీ నోరు తెరిస్తే భూతులే వస్తాయని, ఆయన చదివిందల్లా భూములు ఆపుడు.. రియల్ ఎస్టెట్ చేయడమే నంటూ ద్వజమెత్తాడు. పాలిటెక్నిక్ ఆస్తులను అమ్మి వచ్చిన సొమ్మును రాహుల్‌గాంధీకి అందించి మెప్పు పొందే కుట్ర పన్నుతున్నారని విమ ర్శించారు. పాలిటెక్నిక్ కళాశాలలను లేబర్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు తీసుకువచ్చిన జీవో నంబర్ 97వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగడుతామని స్పష్టం చేశారు. జీవో 97ను రద్దు చేసే వరకు విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు బీఆర్‌ఎస్ పార్టీ వారి వెంట ఉంటుందని భరోసానిచ్చారు. త్వరలో ప్రా రంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జీవో 97 అంశాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యేలంతా ప్రభుత్వం ముందు ప్రస్తావిస్తారని తెలిపారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, ఈ జిల్లా బిడ్డగా విద్యార్థు లకు ఉండగా నిలుస్తానని చెప్పారు. వెంట, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మినరసింహారా వు, గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్‌ప ర్సన్ తుల ఉమా, న్యాలకొండ అరుణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధ వి, సర్పంచ్ సంజన-మహేష్, తిరుపతి తదితరులు ఉన్నారు.